MUDRA Yojana: మోదీ సర్కార్..ఎలాంటి గ్యారంటీ లేకుండానే అందిస్తున్న రూ.20 లక్షల లోన్ కావాలంటే ఏం చేయాలి?
Pradhan Mantri MUDRA Yojana: కేంద్రంలోని మోదీ సర్కార్..ఎన్నో సరికొత్త స్కీములను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే ఇటీవలి బడ్జెట్లో నిరుద్యోగులు, వ్యాపారస్తులకు తీపికబురు అందించింది. గతంలో ముద్ర రుణాల లిమిట్ ను పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి గ్యారెంటీ లేకుండా అందిస్తున్న ఈ రూ. 20లక్షల లోన్ కావాలంటే ఏం చేయాలి?పూర్తి వివరాలు తెలుసుకుందాం.
MUDRA Yojana:కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో నిరుద్యోగులు, వ్యాపారస్తులపై వరాల జల్లు కురిపించింది. ఇందులో ముఖ్యంగా ముద్ర రుణాలలో లిమిట్ ను పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. గతంలో ఈ లిమిట్ పది లక్షల వరకు మాత్రమే ఉండేది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ముద్ర లోన్స్ లిమిట్ 20 లక్షలకు పెంచడం ద్వారా పలు రకాల వ్యాపారులు ముఖ్యంగా చిరు వ్యాపారులు ఎక్కువగా సంతోషిస్తున్నారు.తమ వ్యాపార విస్తరణ కోసం ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని చెబుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు ఎక్కువగా ఈ ముద్రా రుణాల వల్ల లాభపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా ముద్రా రుణాలు అనేవి మూడు కేటగిరీలో ఇస్తారు ఇవి గతంలో 50 వేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు లిమిట్తో రుణాలను పంపిణీ చేసేవారు 50వేల రూపాయల వరకు పొందే రుణాలను శిశు రుణాలు అనేవారు 50 వేల నుంచి ఐదు లక్షల వరకు రుణాలు పొందే వారిని తరుణ్ ముద్రా రుణాలు అనేవారు పది లక్షల రూపాయల రుణాలు పొందే వారిని కిషోర్ ముద్ర లోన్లు అంటారు. అయితే ప్రస్తుతం ముద్రా రుణాల లిమిట్ 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు పొడిగించుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా లాభదాయకమనే చెప్పవచ్చు.
ముద్ర రుణాలను పొందాలంటే ఏం చేయాలి:
ముద్రా రుణాలను పొందాలంటే మీరు ముందుగా మీ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ బ్యాంకు మేనేజర్ ను సంప్రదించి ముద్రా రుణ దరఖాస్తును పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు రుణం పొందేందుకు మీరు మీరు చేస్తున్న వ్యాపారం గురించి పూర్తిస్థాయి వివరాలను వారికి తెలియజేయాలి. ఆ తర్వాత మీ వ్యాపారాన్ని పరిశీలించి బ్యాంకు వారు రుణం అందజేస్తారు.
Also Read : ITR Filing: ఐటీఆర్ గడువు ఇంకా 5రోజులే..కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుందా?
ముద్ర రుణాలపై వడ్డీ శాతం ఎంత ఉంటుంది:
ముద్ర రుణాలపై వడ్డీ బయట ప్రైవేటు వడ్డీలతో పోల్చి చూసినట్లయితే, చాలా తక్కువగా ఉంటుంది. ముద్ర రుణాలపై వడ్డీ రేట్లు బ్యాంకులో నిర్ణయం తీసుకుంటాయి. వీటిని సకాలంలో చెల్లించినట్లయితే, మీరు మరిన్ని రుణాలు పొందే అవకాశం ఉంటుంది.
రూ. 20 లక్షల రుణం కావాలంటే ఏం చేయాలి:
ముద్రా రుణాలను సాంక్షన్ చేసే ఎంపిక విధానం మొత్తం కూడా బ్యాంకు వారి చేతుల్లోనే ఉంటుంది. మీకు 20 లక్షల రూపాయల ముద్ర రుణం పొందాలంటే, గతంలో తీసుకున్నటువంటి ముద్ర రుణాలను పూర్తిగా బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో బ్యాంకుల తమ సొంత నిబంధనలను కూడా అమలు చేస్తుంటాయి. బ్యాంకులు ఇచ్చే ముద్ర రుణాలను సదరు బ్యాంకు మేనేజరు మీ వ్యాపారం పూర్తిస్థాయి డాక్యుమెంటేషన్ అదే విధంగా ఇతర నిబంధనలను పూర్తి చేసిన అనంతరమై 20 లక్షల రూపాయలను శాంక్షన్ చేస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook