ITR Filing: ఐటీఆర్ గడువు ఇంకా 5రోజులే..కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుందా?

ITR Filing Deadline: ఐటీఆర్ ఫైలింగ్ డెడ్ లైన్ సమీపిస్తోంది. ఐటీఆర్ ఫైలింగ్ చేసేందుకు ఇంకా ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. జులై 31తో గడువు ముగుస్తుండటంతో చెల్లింపుదారులు గగ్గోలు పెడుతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తుడుంటంతో గడువు పెంచాలంటూ చెల్లింపుదారులు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి కేంద్రం నుంచి కీలక ప్రకటన వస్తుందా? లేదా చూద్దాం.   

Written by - Bhoomi | Last Updated : Jul 26, 2024, 11:21 AM IST
ITR Filing: ఐటీఆర్ గడువు ఇంకా 5రోజులే..కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుందా?

ITR Filing : ఇప్పుడంతా ఐటీఆర్ ఫైలింగ్ సీజన్ నడుస్తోంది. జులై 31వ తేదీ దగ్గరపడుతుండటంతో..చెల్లింపుదారులు టెన్షన్ పడుతున్నారు. జులై 22 వరకు 4కోట్లకు పైగా ఐటీఆర్ లు ఫైల్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇది భారతదేశంలోని 2024-25 అసెస్ మెంట్ ఇయర్ లోని మొత్తం ఆదాయపుపన్ను చెల్లింపుదారుల్లో 45శాతం కంటే తక్కువ. కాగా గతేడాది ఇదే కాలంలో దాఖలైన  రిటర్నులతో పోల్చి చూసినట్లయితే...ఇది 8శాతం ఎక్కువ ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. అయితే ఇ ఫైలింట్ ఐటీఆర్ పోర్టల్ ను ఉపయోగిస్తున్న పన్ను చెల్లింపుదారులు, నిపుణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పలువురు చార్టర్డ్ అకౌంటెంట్ సంఘాలు కూడా ఇన్ కమ్ ట్యాక్స్ శాఖను సంప్రదించాయి. 

పన్నులోపాలు ఏంటి? 

పన్ను చెల్లింపుదారులు అనేక సమస్యలను ఐటీశాఖ ముందుకు తీసుకెళ్లారు. 

-పోర్టల్ లోని సమస్యలు,  TIS, AISలోని గణాంకాల మధ్య వ్యత్యాసాల కారణంగా  ఫారమ్ 26AS/AIS/TISని యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 

- జాయింట్ అకౌంట్ హెల్డర్స్ స్టేట్ మెంట్స్ లో జాయింట్ ఇన్ కమ్ నివేదించారు. పన్ను చెల్లింపుదారుల నుంచి సకాలంలో నోటిఫికేషన్స్ వచ్చినప్పటికీ స్క్రూటినీ నోటీసులకు దారి తీస్తుంది.

-AIS/TIS పోర్టల్‌లో కొన్నింటికి మాత్రమే రెస్పాండ్ అవ్వడం ఇబ్బందులకు కారణం అవుతుంది. TISలో రియాక్షన్స్ అప్డేట్ వెంటనే కనిపించకపోవడం వల్ల అసహనానికి గురవుతున్నారు. 

-ఫారమ్ సమర్పించడానికి పన్ను చెల్లింపుదారులకు బఫరింగ్, టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయి.  

-జీతం, వడ్డీ ఆదాయం, TDS గణాంకాలు వంటి ITRలో ముందుగా పేర్కొన్న డేటా, ఫారమ్ 26ASలోని డేటాతో సరిపోలడం లేదు.

-వ్యాపార ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారులు షెడ్యూల్ OSలో డివిడెండ్ ఆదాయంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, ఎందుకంటే ప్రస్తుత వినియోగానికి ఆదాయాన్ని మొదట వ్యాపార ఆదాయంలో సరిపోలాలి. లేదంటే తగ్గించాలి. ఈ ప్రక్రియ మరింత ఇబ్బందికరంగా మారింది.  

-పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను ఫైల్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎర్రర్ మెసేజ్‌లు రావడం..రిటర్న్ లు ఫైల్ చేసినట్లు మెసేజ్ రావడంలో సమస్యలు వస్తున్నాయి.  

-ఇక ఒటిపి వెంటనే రావడం లేదు. రిటర్న్స్ కన్ఫర్మ్ చేసుకోవడం ఫెయిల్ అవుతోంది. కొంతమంది పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన ITRల రసీదులను డౌన్‌లోడ్ కావడం లేదు. 

Also Read : Stocks To Buy: మోతీలాల్ ఓస్వాల్ రికమండ్ చేసిన ఈ 5 స్టాక్స్ పై ఓ లుక్కేయ్యండి..38 శాతం లాభం పొందే చాన్స్..!!

పన్ను శాఖ జూలై 31 గడువును పొడిగిస్తారా?

ఐటీ రిటర్న్స్ దాఖలుకు చివరి తేదీని ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్న సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు మాత్రం పోర్టల్లో అవాంతరాలను ఎదుర్కొంటున్నారని..వారి యాన్యువల్ ఇన్ కమ్ స్టేట్ మెంట్ ట్యాక్స్ ఇన్ ఫర్మేషన్ స్టేట్ మెంట్ లో వ్యత్యాసాలను ఎదుక్కొంటున్నందున, గడువు తేదీని పొడిగించాలని కోరుతున్నారు. అయితే గతేడాది ఇదే కాలంతో పోల్చితే ఎక్కువ రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. అందుకే తేదీని పొడిగించకపోవచ్చని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News