Mukesh Ambani faces $5 billion loss: ముంబై: ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ( RIL chief Mukesh Ambani ) పేరెత్తితే.. ఆయనకు అనుక్షణం సంపాదించడమే తెలుసు కానీ నష్టమంటే ఏంటో తెలీదనుకుంటాం. ఎందుకంటే క్షణక్షణం అంబానీ ఆస్తి విలువ మిలియన్, బిలియన్ డాలర్స్‌లో పెరుగుతుందే కానీ తరగదు. కానీ అటువంటి అంబానీ ఆదాయంపై ఇటీవల కరోనావైరస్ ( Coronavirus ) తీవ్ర ప్రభావం చూపించింది. కరోనావైరస్, లాక్‌డౌన్ కారణంగా ఇంధనం వినియోగం భారీగా పడిపోవడంతో గత త్రైమాసికం రిలయన్స్ లాభాల్లో 15 శాతం తగ్గుదల నమోదైంది. Also read : Gold Rate Today: పెరిగిన బంగారం ధరలు.. భారీగా దిగొచ్చిన వెండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుండగా తాజాగా ముకేష్ అంబానీ 5 బిలియన్ డాలర్స్ నష్టపోయారు ( Mukesh Ambani lost $5 billion). అంబానీ నష్టపోవడం అనేది అరుదుగా జరుగుతుంది కనుక వ్యాపారవర్గాల్లో ఇప్పుడిదో హాట్ టాపిక్ అయ్యింది. రిలయన్స్ షేర్స్ నష్టపోయిన కారణంగా ముకేశ్ అంబానీ తన నికర మొత్తం నుండి 5 బిలియన్ డాలర్లను కోల్పోవాల్సి వచ్చింది. త్రైమాసిక లాభం తగ్గిన తరువాత గత మూడు నెలల్లో ఎప్పుడూ లేనంతగా రిలయన్స్ వాటాల ధరలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.


ఇండియాలో అత్యంత సంపన్నమైన వ్యాపార సామాజ్ర్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ( Reliance Industries Limited ) పేరుంది. అలాంటి రిలయన్స్ స్టాక్ సోమవారం మధ్యాహ్నం 12:21 నాటికి ముంబైలో 6.8% పడిపోయింది. మే 12 నుండి ఇంత భారీ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి కాగా.. జూలై 20 తర్వాత ఇంత కనిష్టానికి పడిపోవడం కూడా ఇదే తొలిసారి. ఫలితంగా ముకేశ్ అంబానీకి 5 బిలియన్ డాలర్స్ నష్టం తప్పలేదు. Also read : Indane LPG gas booking number: ఇండేన్ గ్యాస్ కస్టమర్స్ కోసం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe