Rules Change from June 2023: జూన్ నెల నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మే నెల ముగింపు తరువాత నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. బ్యాంకింగ్‌ రంగంలో కీలక మార్పులు జరగనుండగా.. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెరిగనున్నాయి. అదేవిధంగా ప్రతి నెల మాదిరే గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు కనిపించే అవకాశం ఉంది. సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు మార్చవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏయే ధరలు పెరిగే అవకాశం ఉందో ఓ లుక్కేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

==> బ్యాంకింగ్ నిబంధనలలో మార్పు 


జూన్ 1వ తేదీ నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమలు చేయబోతుంది. అన్‌క్లెయిమ్ చేయని మొత్తాన్ని సెటిల్ చేయనుంది. దీనికి '100 దిన్ 100 పే' అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని అన్ని బ్యాంకులకు ఆర్‌బీఐ తెలియజేసింది. 100 రోజుల్లో 100 అన్‌క్లెయిమ్డ్ సెటిల్‌మెంట్లు చేయనుంది.


==> ఎలక్ట్రిక్ వాహనాలు ఖరీదైనవి 


జూన్ నెల నుంచి ఎలక్ట్రిక్ టూ వీలర్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ముందే జాగ్రత్త పడండి. ప్రభుత్వం సబ్సిడీని కిలోవాట్‌కు రూ.10 వేలకు తగ్గించింది. గతంలో ఇది కిలోవాట్‌కు రూ.15 వేలు ఉండేది. ప్రభుత్వ ఉత్తర్వులు జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. అంటే జూన్ 1 తర్వాత ద్విచక్ర వాహనాల ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుకు 25 నుంచి 30 వేల రూపాయలు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది.


==> గ్యాస్ సిలిండర్ ధర 


అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల ధరలో మార్పులు జరిగే అవకాశం ఉంది. గత నెలలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ ధరను తగ్గించారు. అయితే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఈ నెలలో ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 


==> సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు


సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు ప్రతి నెల మారుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో సీఎన్‌జీ ధరలు తగ్గించారు. పెట్రోలియం కంపెనీలు సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు మారుస్తాయి. ఈ నెలలో కూడా మారవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 


==> దగ్గు సిరప్ ఎగుమతి
భారతీయ దగ్గు సిరప్ ఎగుమతికి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తమ విచారణ లేకుండా ఎగుమతి చేయకూడదని స్పష్టం చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఈ విషయాలపై నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.


Also Read: CSK Vs GT Dream11 IPL Final Match Dream11 Prediction: ఐపీఎల్ ఫైనల్‌కు వేళయా.. గుజరాత్‌కు చెన్నై చెక్ పెడుతుందా..? డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇవే..


Also Read: CSK Vs GT IPL 2023: క్షణాల్లో మ్యాచ్‌ మార్చేసే వీరులు.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి