OLA Electric Layoffs : ఉద్యోగులకు ఓలా ఎలక్ట్రిక్ బిగ్ షాక్..వందలాది ఉద్యోగాలు లేఆఫ్?
OLA Electric Layoffs : భారత ప్రముఖ వ్యాపారవేత్త భవిష్ అగర్వాల్ యాజమాన్యంలోని ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగులకు షాకిచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది. కంపెనీలోని లోపాలను సమీక్షించుకునే పనిలో భాగంగానే ఉద్యోగులకు తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
OLA Electric Layoffs : ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీదారు సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. 5వందల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ తన పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా పలు విభాగాల్లో వేరువేరు స్థాయిల్ల ఉన్న వ్యక్తులకు లేఆఫ్ ప్రకటించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విక్రయానంతర సేవల విషయంలో పెద్దెత్తున విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఈ నిర్ణయం వెలువడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఈ తొలగింపు ప్రక్రియ జులై నుంచి కొనసాగుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి వెల్లడించారు. పలు విభాగాల్లో పలు స్థాయిల్లో దశలవారీగా ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ నెలాఖరుకల్లా లేఆఫ్స్ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న శ్రామికశక్తిని సమర్ధవంతంగా వినియోగించుకుని తద్వారా మార్జిన్లు, లాభదాయకతను పెంచుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.
ఓలా ఎలక్ట్రిక్ నిర్వహిస్తున్న ఈ లేఆఫ్ ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి కానుంది. స్కూటర్ల విక్రయం తర్వాత పేలవమైన, నాణ్యమైన సేవ కోసం కంపెనీ ఇటీవల చాలా విమర్శలను ఎదుర్కొంది. ఈ నెల ప్రారంభంలో, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్, దాని ఎలక్ట్రిక్ స్కూటర్లలో లోపాలకు సంబంధించిన ఫిర్యాదులపై వివరణాత్మక విచారణకు ఆదేశించింది. CCPA నుండి వచ్చిన 10,644 ఫిర్యాదులలో 99.1 శాతం పరిష్కరించినట్లు కంపెనీ గత నెలలో తెలిపింది.
ఇది చదవండి: Adani Bribe: పురందేశ్వరి సంచలన ట్వీట్.. అదానీతో వైఎస్ జగన్ లంచం తీసుకున్నాడు
ఓలా ఎలక్ట్రిక్ షేర్లు శుక్రవారం మంచి లాభాలతో ముగిశాయి:
శుక్రవారం ఓలా ఎలక్ట్రిక్ షేర్లు రూ.1.90 (2.83%) లాభంతో రూ.69.14 వద్ద ముగిసింది. ఈ రోజు కంపెనీ షేర్లు క్షీణతతో ప్రారంభమయ్యాయి. అయితే ట్రేడింగ్ సమయంలో కొనుగోళ్లు పెరగడంతో షేర్ ధర బాగా పెరిగింది. ఈరోజు ట్రేడింగ్‌లో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ.66.60 నుంచి ఇంట్రాడే గరిష్ఠ స్థాయి రూ.69.50కి చేరాయి. CCPA చర్య తర్వాత, కంపెనీ షేర్లలో భారీ పతనం జరిగింది. ఓలా ఎలక్ట్రిక్ షేర్ల 52 వారాల గరిష్టం రూ.157.53, 52 వారాల కనిష్టం రూ.66.60.
Also Read: Sharmila: బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ప్రభాస్ తో నాకు ఎటువంటి సంబంధం లేదు.. షర్మిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter