Ola Sports Car: ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా త్వరలో స్పోర్ట్స్ కారు లాంచ్ చేయనుంది. ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతీయ వినియోగదారుల కోసం ఓలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు తీసుకొచ్చేందుకు సిద్ఘంగా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ఓలా కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. మరోవైపు ఓలా కంపెనీ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎస్1 సిరీస్ గురించి కూడా వివరించారు. 


తొలిసారిగా మేకిన్ ఇండియా స్పోర్ట్స్ కారు తయారు చేయబోతున్నామని భవీష్ అగర్వాల్ తెలిపారు. అదే సమయంలో త్వరలో రానున్న మూవోఎస్ 3 గురించి అప్ డేట్ ఇచ్చారు. దీపావళి నాటికి ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లేటెస్ట్ వెర్షన్ లాంచ్ కానుందని వెల్లడించారు. ఈ ఏడాది దీపావళికి మూవోఎస్ 3 లాంచ్ ఉండనుందని ట్వీట్ చేశారు. మూవోఎస్ 3 అనుభవం పొందేంతవరకూ నిరీక్షించకతప్పదని ట్వీట్ చేశారు. ఓలా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 5 వందలమంది సిబ్బందిని తొలగించనున్నట్టు కూడా ఓలా ఇప్పటికే ప్రకటించింది. 


ప్రస్తుతం  తొలి మేకిన్ ఇండియా ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు త్వరలో తయారు చేసే ప్రణాళిక సిద్ధమౌతోందని ఓలా కంపెనీ సీఈవో తెలిపారు. 


Also read: Flipkart Offers: రేపే ఆఫర్ ముగింపు.. రూ.20 వేలు విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం రూ.3999కే..



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.