OLA Electric Car: ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ కంపెనీ ఓలా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో అప్‌డేట్ వెలువడింది. అటు ఎలక్ట్రిక్ కారును కూడా మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ యోచిస్తోంది. ఎప్పుడనే వివరాల్ని ఆ సంస్థ వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ రైడ్ హైరింగ్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ వాహనాల(Ola Electric Vehicles) రంగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. త్వరలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో ప్రవేశపెట్టబోతోంది. ఇప్పటికే పది లక్షల వరకూ బుకింగ్స్ పూర్తయినట్టు ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తొలి బ్యాచ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను డిసెంబర్ 15 నుంచి ప్రవేశపెట్టనుంది. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూపు సహకారంతో ఇండియాను ఎలక్ట్రిక్ వాహనాల కేంద్రంగా మార్చాలనేది తమ లక్ష్యమన్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ కార్ల విషయంలో కూడా అప్‌డేట్ ఇచ్చారు. 2023లో ఓలా మొదటి ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. 


ఇండియాలో ప్రారంభమైన ఓలా కంపెనీ (Ola Company)ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లో సేవలందిస్తోంది. గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ హబ్‌గా ఇండియా తయారు చేయడమే సంస్థ ఉద్దేశ్యమన్నారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు(Ola Electric Scooter), 2023 నాటికి ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌లో ఉంటాయని ఆ సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ చెప్పారు. 2022 ఫస్ట్ హాఫ్ ఇయర్‌లో ఓలా పబ్లిక్ ఇష్యూ ఉండవచ్చని ఆ సంస్థ సీఈవో ప్రకటించారు. పబ్లిక్ ఇష్యూ ద్వారా 1 బిలియన్ డాలర్లు సమీకరించాలనేది కంపెనీ లక్ష్యంగా ఉంది. మరోవైపు పర్సనల్ లోన్లు, మైక్రో ఫైనాన్సింగ్ సేవల్ని కూడా అందించనున్నట్టు ఓలా తెలిపింది. 


Also read: IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్ రికార్డు, భారీగా ప్లేస్‌మెంట్స్, 2 కోట్లకు పైగా వేతనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook