Paytm Issue: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను త్వరలో రిలయన్స్‌కు చెందిన జియో పైనాన్షియల్ సర్వీసెస్ కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే రెండు కంపెనీల మధ్య చర్చలు సైతం జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపధ్యంలో ఆ సంస్థ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. షేర మార్కెట్‌లో ఆ సంస్థ షేర్లు గణనీయంగా పడిపోతున్నాయి. వరుసగా మూడోరోజు కూడా పతనం కొనసాగింది. దాదాపు 40-50 శాతం షేర్ విలువ పడిపోయింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం సంస్థ ప్రజల్నించి డబ్బులు వసూలు చేయకూడదు. అంటే ఫాస్టాగ్ వంటివి ఇకపై పనిచేయవు. వ్యాలెట్ నింపేందుకు వీలుండదు. ఈ పరిస్థితుల్లో పేటీఎం యాప్ యూజర్లలో గందరగోళం నెలకొంది. పేటీఎం కొనసాగించాలా వద్దా అనే సందేహం ఏర్పడింది. వాస్తవానికి ఆర్బీఐ ఆంక్షలు విధించింది కేవలం పేటీఎం పేమెంట్స్ వసూళ్లపైనే. ఇతర యూపీఐ సేవలు యధావిధిగా కొనసాగించవచ్చు. 


కానీ మార్కెట్‌లో పరిస్థితి మరోలా ఉంది. పేటీఎం చుట్టూ వివిధ రకాల వార్తలు విస్తరించడంతో ఆ సంస్థకు ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. అదే సమయంలో ప్రముఖ సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని, ఇప్పటికే రెండు సంస్థల మధ్య చర్చలు జరిగాయనే వార్తలు వచ్చాయి. మరోవైపు పేటీఎం పేమెంట్స్ వ్యాలెట్ కొనుగోలు చేసేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆసక్తి చూపిస్తోందని తెలుస్తోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మాత్రం  ఈ వార్తల్ని కొట్టిపారేసింది. ఈ సంక్షోభం నుంచి బయటకు వస్తామని, ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. తప్పు ఎక్కడ జరిగిందో అర్ధం కావడం లేదని వెల్లడించింది. ఆర్బీఐతో సంప్రదించి ఏం చేయాలో నిర్ణయిస్తామంటోంది. ఉద్యోగులు ఎవరినీ తొలగించమని భరోసా ఇచ్చింది. 


పేటీఎం పేమెంట్స్ కొనుగోలు వార్తల నేపధ్యంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు మాత్రం దూసుకుపోయాయి. నిన్న అంటే సోమవారం మార్కెట్ ముగిసేసరికి 1628 శాతం పైగి ఎగసి 295 రూపాయల ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. అదే సమయంలో పేటీఎం షేర్ల పతనం కొససాగింది. బెయిల్ అవుట్ ప్లాన్‌లో భాగంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బిజినెస్‌ను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కొనుగోలు చేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జియో పేమెంట్స్ బ్యాంక్ ఇప్పటికే డిజిటల్ సేవింగ్స్ ఎక్కౌంట్లు, బిల్ పేమెంట్లను అందుబాటులో తీసుకొచ్చింది. అదే సమయంలో డెబిట్ కార్డులు లాంచ్ చేసింది. 


Also read: Paytm crisis: పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు, ఫాస్టాగ్ పనిచేస్తుందా లేదా, ఏం చేయాలి మరి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook