Petrol Price Hiked: వరుసగా నాలుగో రోజూ పెట్రోల్ ధరల మోత- చెన్నైలో సెంచరీ కొట్టిన డీజిల్
Fuel price Hiked: దేశంలో పెట్రోల్ ధరల మోత కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
Petrol Price in India: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. శనివారం పెరిగిన ధరలతో మరో కొత్త రికార్డు స్థాయికి చేరాయి ఇంధన ధరలు.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) మాత్రం.. అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగణంగా మాత్రమే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు
హైదరాబాద్‌లో పెట్రోల్ (Petrol price in Hyderabad) ధర లీటర్ 37 పైసలు పెరిగి.. రూ.111.51 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర (Diesel Price in Hyderabad) 38 పైసలు పెరిగి.. రూ.104.66 వద్ద ఉంది.
విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 35, 36 పైసల చొప్పున పెరిగాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర (Petrol price in Vizag) రూ.112.27 వద్ద, డీజిల్ ధర (Diesel price in Vizag) రూ.104.86 వద్ద ఉన్నాయి.
Also read: House Of Khaddar: ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఖద్దర్‌ను లాంచ్ చేయనున్న కమల్ హాసన్
మెట్రో నగరాల్లో ఇంధన ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Delhi) 35 పైసలు, డీజిల్ ధర లీటర్ 35 పైసలు పెరిగింది. దీనితో పెట్రోల్, డీజిల్ (Diesel Price in Delhi) ధరలు లీటర్‌కు వరుసగా.. రూ.107.24, రూ.95.98 వద్ద ఉన్నాయి.
చెన్నైలో పెట్రోల్ ధర (Petrol Price in Chennai) లీటర్ 31 పైసలు పెరిగి.. రూ.140.19 వద్ద ఉంది. లీటర్ డీజిల్ (Diesel Price in Chennai) ధర 33 పైసలు పెరిగి.. రూ.100.22 వద్దకు చేరింది.
బెంగళూరులో పెట్రోల్ ధర (Petrol Price in Bengaluru) లీటర్ 37 పైసలు పెరిగి రూ.110.94 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర 37 పైసలు పెరిగి (Diesel Price in Bengaluru) రూ.101.82 వద్దకు చేరింది.
దేశ ఆర్థిక రాజధాని దిల్లీలో పెట్రోల్ ధర లీటర్ 34 పైసలు పెరిగి (Petrol Price in Mumbai)రూ.113.08కి చేరింది. లీటర్ డీజిల్ ధర 37 పైసలు పెరిగి రూ.103.97 వద్ద (Diesel Price in Mumbai) కొనసాగుతోంది.
కోల్‌కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటర్‌కు రికార్డు స్థాయిలో.. 67 పైసలు, 70 పైసల చొప్పున పెరిగాయి. దీనితో లీటర్ (Petrol Price in Kolkata) పెట్రోల్ రూ.107.74 వద్దకు చేరింది. డీజిల్ ధర లీటర్ (Diesel Price in Kolkata) రూ.99.05 వద్ద కొనసాగుతోంది.
Also read: Amazon prime Price hike: షాకిచ్చిన అమెజాన్- 50 శాతం పెరగనున్న ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధరలు!
Also read: NEET PG 2021 Admissions: పీజీ నీట్ 2021 అడ్మిషన్లకై కౌన్సిలింగ్ మరో రెండ్రోజుల్లో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook