Portable Mini Air Conditioner: ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. బయట ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గం.-10గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఏసీలు, కూలర్లతో ఇళ్లల్లోనే కాస్త సేద తీరుతున్నారు. ఒకవేళ తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వస్తే.. పోర్టబుల్ ఏసీ, ఫ్యాన్లను వెంట తీసుకెళ్లడం ఉత్తమం. ప్రస్తుతం అమెజాన్‌లో పలు కంపెనీలకు చెందిన మినీ పోర్టబుల్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. అందులో అత్యంత చౌక ధరకు అందుబాటులో ఉన్న పోర్టబుల్ ఏసీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేవలం రూ.829కే పోర్టబుల్ మినీ ఏసీ :


అమెజాన్‌లో చాలా కంపెనీలకు చెందిన పోర్టబుల్ మినీ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అన్నింటి కన్నా చౌకగా రూ.829కే పోర్టబుల్ మినీ ఏసీ అందుబాటులో ఉంది. సాధారణంగా దీని ధర రూ.1500 వరకు ఉంటుంది. కానీ అమెజాన్‌లో మీరు దీన్ని తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ప్రయాణాల్లోనే కాదు... ఇంట్లో మీరు పనిచేసే చోట.. లేదా మీరు ఎక్కడ కూర్చొంటే అక్కడ దీన్ని సులువుగా అమర్చుకోవచ్చు.


కేవలం కొద్ది నిమిషాల్లోనే ఇది గది మొత్తాన్ని చల్లబరుస్తుంది. దీని సైజు కూడా చాలా చిన్నది కావడంతో ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. ఇందులో హై, మీడియం, లో ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇది హ్యూమిడిఫైయర్, ప్యూరిఫైయర్‌గా కూడా పనిచేస్తుంది. ప్రస్తుత సమ్మర్ సీజన్‌లో ఎండ వేడిమి, ఉక్కపోతకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీని యూఎస్‌బీ కేబుల్ సాయంతో ల్యాప్‌ట్యాప్‌కి కూడా కనెక్ట్ చేసి చార్జ్ చేసుకోవచ్చు.


ఇదే అమెజాన్‌లో ఉబెర్‌స్వీట్‌కి చెందిన పోర్టబుల్ మినీ ఏసీ కేవలం రూ.1949కే అందుబాటులో ఉంది. సాధారణంగా దీని ధర రూ.3524. కానీ 45 శాతం డిస్కౌంట్‌తో దీన్ని మీరు అత్యంత చౌక ధరకు పొందవచ్చు. ఈ మినీ ఏసీ కేవలం 15 నిమిషాల్లోనే గది మొత్తాన్ని చల్లబరుస్తుంది. తక్కువ ధరలో అందుబాటులో ఉండటంతో చాలామంది కస్టమర్స్ పోర్టబుల్ మినీ ఏసీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మండుతున్న ఈ ఎండల్లో పోర్టబుల్ మినీ ఏసీలను వెంట తీసుకెళ్లడం ద్వారా కాస్త ఉపశమనం పొందుతున్నారు.


Also Read: Avatar 2 Trailer: జేమ్స్ కెమెరూన్ భారీ ప్లాన్.. 160 భాషల్లో 'అవతార్ 2' రిలీజ్!


Also Read: TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్... త్వరలో మరో రెండు 'డీఏ'లు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.