Jandhan yojana: రూపాయి బ్యాలెన్స్ లేకున్నా.. 10 వేల వరకు డ్రా చేసుకోవచ్చు
Jandhan yojana: ఒక్కోసారి డబ్బులు అత్యవసరమౌతాయి. ఎక్కౌంట్లో డబ్బులుండవు. మరేం చేయాలి. అప్పు చేయకుండానే డబ్బులు వచ్చే మార్గాల్లేవా అంటే ఉన్నాయనే సమాధానం వస్తోంది. అదెలాగనుకుంటున్నారా
Jandhan yojana: ఒక్కోసారి డబ్బులు అత్యవసరమౌతాయి. ఎక్కౌంట్లో డబ్బులుండవు. మరేం చేయాలి. అప్పు చేయకుండానే డబ్బులు వచ్చే మార్గాల్లేవా అంటే ఉన్నాయనే సమాధానం వస్తోంది. అదెలాగనుకుంటున్నారా...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన కొన్ని పథకాల్లో ప్రాచుర్యం పొందిన పథకం ప్రధానమంత్రి జనధన్ యోజన. అన్ని బ్యాంకుల ద్వారా ఆర్ధికపరమైన లబ్ది పొందే అవకాశాన్ని కల్పించే పథకమిది. 2014 ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన పథకమిది. అదే ఏడాది ఆగస్టు 28న ప్రారంభించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్, రుణం, భీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పించే ఉద్దేశ్యంతో ప్రారంభించారు.
10 వేల వరకూ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం
ప్రధానమంత్రి జనధన్ యోజన లబ్దిదారులు ఎక్కౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా సరే..10 వేల వరకూ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందగలరు. గతంలో జనధన్ యోజనలో ఓడీ సౌకర్యం 5 వేలుండగా..ఇప్పుడు 10 వేలకు పెంచారు. 2 వేలవరకూ ఓడీని ఏ విధమైన షరతుల్లేకుండా పొందవచ్చు. ఓడీ సౌకర్యం పొందాలంటే మీ జనధన్ యోజన ప్రారంభమై కనీసం ఆరు నెలలై ఉండాలి. లేకపోతే కేవలం 2 వేల రూపాయలే తీసుకోగలరు. 60-65 ఏళ్లవారికైతే ఓడీ పరిమితి పెరుగుతుంది.
ప్రధానమంత్రి జనధన్ యోజన ఖాతాలు డీబీటీ, ప్రదానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ బ్యాంక్ ముద్ర పధకాలకు అర్హత కలిగి ఉంటాయి.
Also read: CNG in Old Cars: పాత కారులో సీఎన్‌జీ పెట్టిస్తే ఎంత ఖర్చవుతుంది? బెస్ట్ బ్రాండ్స్ ఏంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook