CNG in Old Cars: పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అందుకే సీఎన్జీకు ఆదరణ పెరుగుతోంది. మీరు కూడా మీ కారుకు సీఎన్జీ కిట్ అమర్చేందుకు ఆలోచిస్తుంటే..ఏ కంపెనీ కిట్ మంచిది, ఎంత ఖర్చవుతుందనేది తెలుసుకుందాం..
ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయం సీఎన్జీ గ్యాస్. ఇంధన ధరలతో వేగలేక మీ కారుకు సీఎన్జీ కిట్ అమర్చుకోవాలని ఆలోచిస్తున్నారా..ఏ కంపెనీ సీఎన్జీ కిట్ మంచిదనేది మరో ప్రశ్న. ఎంత ఖర్చవుతుందనేది సందేహం. ఈ క్రమంలో కొన్ని బెస్ట్ బ్రాండ్స్ , ఖర్చు వివరాలు మీ కోసం అందిస్తున్నాం..
మార్కెట్‌లో సీఎన్జీ కిట్స్‌లో దాదాపు చాలా బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని బ్రాండ్స్‌కు ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా ఉంది. అలాంటి బ్రాండ్స్ కిట్స్ అమర్చుకుంటే ఏ విధమైన సమస్య ఉండకపోవచ్చు. అందులో కొన్ని BRC,Landi-Renzo,Lovato Autogas,Unitax,SKN,Tartarini,Tomasetto,Zavoli, Bedni,Bugatti,Longas ఉన్నాయి.
సీఎన్జీ కిట్ అమర్చేందుకు ఎంత ఖర్చవుతుంది
సీఎన్జీ కిట్ ఖర్చు అనేది బ్రాండ్‌ను బట్టి ఉంటుంది. సాధారణంగా ఒక్కొక్క కిట్ ఖర్చు 25-28 వేల రూపాయల్నించి ప్రారంభమై..40-50 వేల వరకూ ఉంటుంది. ఇందులో సీఎన్జీ సిలెండర్ ధర కూడా కలిపే ఉంది. కోవిడ్ మహమ్మారి అనంతరం సీఎన్జీ సిలెండర్ ధరలు పెరిగాయి.
సీఎన్జీ కిట్ లాభాలు, నష్టాలు
సీఎన్జీ కిట్‌తో కలిగే అతిపెద్ద ప్రయోనం పెట్రోల్‌తో పోలిస్తే ధర చాలా తక్కువ. సీఎన్జీతో మైలేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అయితే సీఎన్జీ కిట్ అమర్చడం వల్ల కారు మెయింటెనెన్స్ అధికమౌతుంది. సేఫ్టీ సంబంధిత సమస్యలు వస్తుంటాయి.
Also read: Vivo Y35 Price: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వివో Y35, ధర, ప్రత్యేకతలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook