PPF and SSY New Rule: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన అంటే ఎస్ఎస్ వై ఎక్కౌంట్లను నిర్ణీత గడువు మార్చ్ 31, 2024లోగా కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.  లేకపోతే ఆ ఎక్కౌంట్లు క్లోజ్ కాగలవు. తిరిగి యాక్టివేట్ చేసేందుకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసినట్టే పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన ఎక్కౌంట్లలో కూడా కనీస బ్యాలెన్స్ ఉండాలి. వీటికి సంబంధించి కొత్త నిబంధన జారీ అయింది. 2024 మార్చ్ 31లోగా ఈ ఎక్కౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లేకుండా ఆ ఎక్కౌంట్లు ఇనాక్టివ్ కాగలవు. పీపీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్ అయితే కనీస బ్యాలెన్స్ 500 రూపాయలు మెయింటైన్ చేయాలి. అంటే ఒక ఆర్ధిక సంవత్సరంలో ఉండాల్సిన కనీస బ్యాలెన్స్ ఇది. ఈ బ్యాలెన్స్ లేకపోతే, మార్చ్ 31 వరకూ గడువుంటుంది. అప్పటికీ బ్యాలెన్స్ మెయింటైన్ కాకపోతే ఆ ఎక్కౌంట్ క్లోజ్ అయిపోతుంది. పెనాల్టీ ఏడాదికి 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అదనపు ప్రయోజనాలు కూడా వర్తించవు. 


సుకన్య సమృద్ది యోజన కనీస బ్యాలెన్స్ 250 రూపాయలు. అంటే ఒక ఆర్దిక సంవత్సరంలో ఉండాల్సిన కనీస బ్యాలెన్స్ ఇది. ఇది మెయింటైన్ చేయకుంటే ఎక్కౌంట్ పనిచేయదు. యాక్టివేట్ చేయాలంటే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడమే కాకుండా 50 రూపాయలు జరిమానా చెల్లించాలి. 


Also read: LIC New Policy: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ, జీవన్ ధార 2 కొత్త డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook