LIC New Policy: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ, జీవన్ ధార 2 కొత్త డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్

LIC New Policy: దేశంలో గత కొద్దికాలంగా మెడికల్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు ఆదరణ పెరుగుతోంది. దేశంలో దిగ్గజ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ వివిధ రకాల పాలసీలు అందిస్తోంది. ఇప్పుడు తాజాగా మరో పాలసీ ప్రవేశపెట్టింది. ఆ పాలసీ వివరాలు, ప్రయోజనాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 20, 2024, 11:12 AM IST
LIC New Policy: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ, జీవన్ ధార 2 కొత్త డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్

LIC New Policy: కరోనా మహమ్మారి తరువాత హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో వృద్ధి కన్పిస్తోంది. ఆరోగ్యంపై, జీవితంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటంతో ఇన్సూరెన్స్ కంపెనీలు సైతం వివిధ రకాల పాలసీలు తీసుకొస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఎల్ఐసీ అందుకు తగ్గట్టే కొత్త కొత్త పాలసీలు అందిస్తోంది. ఇప్పుడు కొత్తగా జీవన్ ధార 2 ప్రవేశపెట్టింది. 

ఇదొక వ్యక్తిగత, సేవింగ్స్ అండ్ డిఫర్ట్ యాన్యుటీ ప్లాన్. ఇందులో 11 రకాల ఆప్షన్లు ఉన్నాయి. జనవరి 22 నుంచి అందుబాటులోకి రానున్న ఈ కొత్త పాలసీకు ఉండాల్సి వయస్సు కనిష్టం 20 ఏళ్ల నుంచి గరిష్టంగా 80 ఏళ్లు ఉంది. గరిష్ట వయస్సుకు అత్యధిక యాన్యుటీ రేట్లు వర్తించేలా ఈ పాలసీ ఉంటుంది. రెగ్యులర్ ప్రీమియం విధానంతో పాటు సింగిల్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ పాలసీ కాల పరిమితి 5-15 ఏళ్లుంటుంది. సింగిల్ ప్రీమియంలో 1-15 ఏళ్లుంటుంది. ఈ పాలసీలో నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్‌లో భాగంగా డిఫర్‌మెంట్ పీరియడ్‌లో కూడా జీవిత భీమా వర్తిస్తుంది. ఏదైనా అవసరమైనప్పుడు రుణ సదుపాయం కూడా ఉంటుంది. 

Also read: Car Mileage Increase Tips: ఏం చేసినా కారు మైలేజీ పెరగడం లేదా? ఈ 4 చిట్కాలతో మీ కోరిక నెరవేరుతుంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News