Pure EV company launches ePluto 7G Max : ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ సంస్థ ప్యూర్ EV సంస్థ‌ 201 KM రేంజ్ లో ePluto 7G Max పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. కొత్తగా రివ‌ర్స్ గేర్ టెక్నాలజీ తో స్కూట‌ర్ ను సంస్థ లాంచ్ చేసింది. మరెన్నో ప్ర‌త్యేక‌త‌లతో ఈ బైక్ లాంచ్ చేయబడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్యూర్ EV- E ప్లూటో 7G మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎలక్ట్రిక్ మోటార్‌ కనెక్ట్ చేయ‌టంతో మంచి స్పెష‌ల్ రైడింగ్ అనుభవాన్ని కూడా ఇస్తుంది. రెట్రో-థీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్ర‌మే కాకుండా, మ‌రెన్నో స్పెష‌ల్ ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చిందీ ప్యూర్ EV సంస్థ‌. 


మైలేజ్.. 
ఇక మైలేజ్ విషయానికి వస్తే.. రెట్రో-థీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా తీర్చిదిద్దిన ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 201 కిలోమీట‌ర్ల నాన్ స్టాప్ గా ప‌రుగులు తీస్తుంది. ఇవి మాత్రమే కాకుండా.. మరెన్నో ఆకర్షనీయమైన  సైతం కలిగి ఉంది. 


మోడ్స్.. 
వీటితో పాటుగా హిల్-స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ తో తీర్చిదిద్దారు. లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసం స్మార్ట్ AI వంటి స‌దుపాయాలుండ‌టం ఈ స్కూటర్ మ‌రో  స్పెషాల్టీ.  


ఈ స్కూట‌ర్ కి క‌నెక్ట్ చేసిన ఎలక్ట్రిక్ మోటార్‌లో 3.5 kWh లిథియం- అయాన్ బ్యాటరీ ప్యాక్ ను అమ‌ర్చ‌డం వలన 3.21 bhp మేర‌ అత్య‌ధిక‌ శక్తినందిస్తుంది. ఈ AIS-156-సర్టిఫైడ్ బ్యాటరీ ప్యాక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన స్మార్ట్ బ్యాటరీ సామ‌ర్ధ్యం అత్యంత కీల‌కం. ఇన్ని ఫీచర్లతో ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ భార‌తీయ ర‌హ‌దారుల‌పై ప‌రుగులు దీయ‌టం ఖాయమని కంపెనీ నిర్వాహ‌కులు ధీమా వ్యక్తం చేసారు. 


Also Read: Android 14 Features: ఆండ్రాయిడ్‌ 14 కొత్త వెర్షన్‌ లాంచ్‌..ఫీచర్స్‌ అన్ని వివరాలు ఇవే!  


కలర్స్ & ధర.. 
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కలర్ లలో ప్యూర్ EV- ePluto 7G Max  లాంచ్ కానుంది. మాట్ బ్లాక్, రెడ్, గ్రే, వైట్ కలర్  లలో  భారతీయ మార్కెట్లోకి విడుద‌ల చేస్తోందీ. ఇక ధ‌ర‌  విషయానికి వస్తే ఎక్స్- షోరూమ్ ధ‌ర‌ కేవ‌లం రూ. 1,14,999 గా ఉంది. దేశవ్యాప్తంగా ఈ స్కూటర్ బుకింగ్ గురించి ప్రకటించింది. అంతేకాకుండా.. ప్లూటో సెవెన్ జీ మ్యాక్స్ బుక్ చేసుకున్న వారికి పండుగ సందర్భంగా డెలివ‌రీ చేస్తోంది. 


ఈ స్కూటర్ రైడింగ్ పై మంచి అనుభూతి అందించటానికి మొత్తం మూడు రైడింగ్ మోడ్‌లు అమర్చారు. దీంతో పాటు, ఈ EV స్కూటర్ 60 వేల‌ కిలోమీటర్ల వారంట్ తో వస్తోంది. 70 వేల‌ కిలోమీటర్ల వారంటీ కూడా అందుబాటులో ఉందని సమాచారం. 


Also Read: Radish Health Benefits: ముల్లంగి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook