Android 14 Features: గూగుల్ తమ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 14 తాజా వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ వెర్షన్‌లో చాలా రకాల అప్‌గ్రేడ్‌లను అందిస్తూ లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం కొత్త అప్‌డేట్‌లలో మెరుగైన డిజైన్ అప్‌గ్రేడ్‌లు, ఇంటర్‌ఫేస్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుంది. Android 14లో లాక్ స్క్రీన్‌పై ఇష్టమైన విడ్జెట్‌లతో పాటు ఫాంట్‌లు, స్టైలీస్ స్క్రీన్ లాక్ వంటి ఆప్షన్స్‌ను కూడా పొందుతారు. అయితే Android 14లో అందుబాటులో ఉన్న ఫీచర్‌లకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
లాక్ స్ట్రీక్‌లో మార్పులు:
తాజా Android ఆపరేటింగ్ సిస్టమ్‌లో లాక్ స్క్రీన్‌కి సంబంధించి భారీ మార్పులను తీసుకువచ్చింది. ముఖ్యంగా టెంప్లేట్స్‌లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు లాక్ స్క్రీన్‌లో మీ స్వంత ఫోటోలు పెట్టుకునే విధంగా, కార్టూన్ స్టైల్ వాల్‌పేపర్, ఇష్టమైన ఎమోజీలను ఎంచుకునే విధంగా కూడా అందిస్తోంది.
నోటిఫికేషన్ ఫ్లాష్‌లు:
ఆండ్రాయిడ్ 14లో ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లో భాగంగా నోటిఫికేషన్ ఫ్లాష్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు కెమెరా ఫ్లాష్ లైట్ అన్‌తో పాటు ఆఫ్ అవ్వడం వంటి ఫీచర్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు అనేక రకాల నోటిఫికేషన్ ఫీచర్స్‌ను అందిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
బ్యాటరీ లైఫ్ పరిమితి పెంపు:
కొత్త OSలో బ్యాక్‌గ్రౌండ్ టాస్క్‌లతో పాటు మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు Android 14లో డౌన్‌లోడ్‌లు-అప్‌లోడ్‌లు, బ్యాటరీ సెట్టింగ్‌లలో చేసిన మార్పులు వంటి చాలా రకాల ఫీచర్స్ అందుబాటులోకి రాబోతున్నాయి.
స్మార్ట్ స్కేలింగ్:
ఆండ్రాయిడ్ 13లో 130 శాతం వరకు ఫాంట్ స్కేలింగ్ ఆప్షన్ కలిగి ఉంటే ఆండ్రాయిడ్ 14లో మాత్రం 200 శాతం వరకు స్కేలింగ్-అప్ ఫాంట్‌లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మీరు మెరుగైన ఇంటర్‌ఫేస్‌ను పొందే సదుపాయాన్ని కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి