Sensex: ఇండియన్ స్టాక్ మార్కెట్‌కు బ్రేక్ పడింది. పదిరోజుల్నించి లాభాలార్జిస్తున్న బుల్‌రన్ కొత్త ఏడాదిలో ఆగిపోయింది. రిలయన్స్, ఐటీసీ షేర్ల ప్రభావం మార్కెట్‌పై పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019 ఏడాది చివర్లో ప్రారంభమైన బుల్‌రన్ ( Bull run )..కొత్త ఏడాదిలో కొనసాగుతూ వచ్చింది. తొలిసారిగా దేశీయ మార్కెట్ ( Indian Stock market ) ‌లో బుల్‌రన్‌కు బ్రేక్ పడింది. ఆరంభంలో పాజిటివ్‌గా ఉన్నా.తరువాత మార్కెట్ అంతా నష్టాల్లోకి జారుకుంది.  48 వేల 6 వందల సూచీ వద్ద కొత్త రికార్డ్ నమోదు చేసిన మార్కెట్ తరువాత క్రమంగా కిందకు దిగిపోయింది. 


ప్రధానంగా ఐటీ ( IT ) , టెక్నాలజీ ( Technology ), ఎఫ్ఎంసీజీ ( Fmcg ) , హెల్త్‌కేర్ కౌంటర్లు భారీ నష్టానికి లోనయ్యాయి. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ ( Reliance industries ), ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్ల అమ్మకాలు మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. డే హై నుంచి 7 వందల పాయింట్లు కోల్పోయయిన సెన్సెక్స్ ( Sensex )..అనంతరం 264 పాయింట్ల నష్టంతో 48 వేల 174 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ ( Nifty ) 53 పాయింట్లు నష్టపోయి..14 వేల 146 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్, హెచ్‌డీ‌ఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు నష్టపోగా..పవర్ గ్రిడ్ కార్పొరేషన్, శ్రీ సిమెంట్స్, గెయిల్, హిందాల్కో గ్రాసీంలు నిఫ్టీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.


Also read: ఏటీఎం నుంచి డబ్బులు తీయడానికి ప్రయత్నిస్తున్నారా? ఇది తప్పనిసరిగా చదవండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook