నెల నెలా క్రమం తప్పకుండా మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేయించే బాధ లేకుండా ఉండాలంటే ఈ ప్లాన్ మీకు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఈ ప్లాన్ ధర తక్కువ..ఫీచర్లు ఎక్కువ. అదేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా మొబైల్ ఫోన్ ప్రతి నెలా రీఛార్జ్ చేయించాల్సి ఉంటుంది. మధ్యలో చేయించకపోతే సర్వీసులు నిలిచిపోతుంటాయి. అయితే ఈ పరిస్థితి తప్పించేందుకు రిలయన్స్ జియో ఓ కొత్త ఆఫర్ ప్రకటించింది. ఈ ప్లాన్‌లో మీరు నెల నెలా రీఛార్జ్ చేయించే పనుండదు. ఈ ఆఫర్‌లో ఒకసారి రీఛార్జ్ చేయించిన తరువాత రెండునెలల వరకూ ఎలాంటి రీఛార్జ్ లేకుండానే కాల్స్, ఇంటర్నెట్ సేవలు నిరాటంకంగా పొందవచ్చు. ఇది జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు వర్తిస్తుంది. అంటే 56 రోజులు ఎలాంటి రీఛార్జ్ లేకపోయినా పనిచేస్తుంటుంది.


ఈ ప్లాన్ ధర ఎంత


జియో ఈ ప్లాన్‌ను 533 రూపాయలకు లాంచ్ చేసింది. ఇందులో ఒకసారి రీఛార్జ్ చేస్తే 2 నెలల వరకూ తిరిగి రీఛార్జ్ చేయించాల్సిన పనిలేదు. మీరు కూడా ఈసారి ఈ ప్లాన్ ట్రై చేయండి. ఈ ప్లాన్‌లో జియో కస్టమర్లకు చాలా ప్రయోజనాలున్నాయి. ఈ ప్లాన్ ప్రకారం 2 నెలలు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆఫర్ ఉంటుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. ఇందులో 56 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. దాంతోపాటు 112 జీబీ డేటా ఉంటుంది. అంటే రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో జియో టీవీ యాప్, జియో సినిమాతో పాటు జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 


Also read: IRCTC Shirdi Package: షిరిడీ భక్తులకు గుడ్‌న్యూస్, తక్కువ ధరకు ఐఆర్‌సీటీసీ సూపర్ టూర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook