IRCTC Shirdi Package: షిరిడీ భక్తులకు గుడ్‌న్యూస్, తక్కువ ధరకు ఐఆర్‌సీటీసీ సూపర్ టూర్

IRCTC Shirdi Package: షిర్డీ సాయి భక్తులకు గుడ్‌న్యూస్. షిరిడీ వెళ్లే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ఐఆర్‌సీటీసీ అతి తక్కువ ధరలో అద్భుతమైన ప్యాకేజ్ ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 3, 2022, 05:56 PM IST
IRCTC Shirdi Package: షిరిడీ భక్తులకు గుడ్‌న్యూస్, తక్కువ ధరకు ఐఆర్‌సీటీసీ సూపర్ టూర్

భారతీయ రైల్వే తరపున దేశంలోని వివిధ ప్రాంతాలు లేదా వివిధ పుణ్యక్షేత్రాల్ని సందర్శించేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజ్‌లు చాలా ఉన్నాయి. ఇప్పుడు షిరిడీ భక్తుల కోసం సాయి శివమ్ పేరుతో కొత్త టూర్ ప్లాన్ చేసింది ఐఆర్‌సీటీసీ. 

షిరిడీ భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రారంభించిన ఈ కొత్త టూర్ ప్లాన్ పేరు సాయి శివమ్. హైదరాబాద్ నుంచి ప్రారంభమై..తిరిగి హైదరాబాద్‌లోనే ముగుస్తుంది. ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజ్. వారంలో ప్రతి శుక్రవారం ఈ టూర్ నడుస్తుంటుంది. నవంబర్ 25 నుంచి అందుబాటులో ఉంటుంది. ఇందులో నాసిక్ యాత్ర కూడా కవర్ కావడం విశేషం. ఏ రోజు ఎక్కడనేది తెలుసుకుందాం..

మొదటి రోజు

ఐఆర్‌సీటీసీ షిరిడీ టూర్ ప్యాకేజ్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభమౌతుంది. పర్యాటకులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో సాయంత్రం 6.50 గంటలకు అజంతా ఎక్స్‌ప్రెస్‌తో మొదలవుతుంది. 

రెండవ రోజు

ఉదయం 7.10 నిమిషాలకు నాగర్‌సోల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా షిరిడికు తీసుకెళ్తారు. ఆలయ దర్శనానంతరం ఆ రాత్రికి షిరిడీలోనే బస ఉంటుంది. 

మూడవ రోజు

మూడోరోజు ఉదయం షిరిడీ నుంచి నాసిక్‌కు బయలుదేరుతారు. అక్కడ త్రయంబకేశ్వర్, పంచవటి సందర్శన ఉంటుంది. ఆ రోజు అంటే మూడోరోజు రాత్రి రిటర్న్ జర్నీ ఉంటుంది. ఆ రోజు రాత్రి 9.20 నిమిషాలకు నాగర్‌‌సోల్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కితే..నాలుగవ రోజు ఉదయం 8.50 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. 

షిరిడీ ప్యాకేజ్ ధర

ఐఆర్‌సీటీసీ ప్లాన్ చేసిన సాయి శివమ్ షిరిడి టూర్ ప్యాకేజ్ స్టాండర్డ్ ధర ముగ్గురు షేరింగ్ అయితే 4910 రూపాయలు, ఇద్దరికైతే 6,550 రూపాయలు, సింగిల్ ఆక్సుపెన్సీకు 11,730 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా కంఫర్ట్ ప్యాకేజ్ ధరలు విడిగా ఉన్నాయి. ఇందులో సింగిల్ ఆక్సుపెన్సీ 13,420 రూపాయలు కాగా, డబుల్ ఆక్యుపెన్సీకు 8,230 రూపాయలు, ట్రిపుల్ ఆక్సుపెన్సీకు 6,590 రూపాయలుంది. 

Also read: Innova Hycross vs XUV 700: ఇన్నోవా హైక్రాస్, ఎక్స్‌యూవీ 700 ఏది మంచిది, ఆ వివరాలు మీ కోసం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News