Innova Hycross vs XUV 700: ఇన్నోవా హైక్రాస్, ఎక్స్‌యూవీ 700 ఏది మంచిది, ఆ వివరాలు మీ కోసం

Innova Hycross vs XUV 700: భారతీయ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్ కార్లు లాంచ్ అవుతుంటాయి. ఒకదాన్ని మించిన ఫీచర్లతో మరో కంపెనీ కారు లాంచ్ అవుతుంటుంది. అందుకే కారు కొనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా కార్ల ఫీచర్లను గమనించాలి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 3, 2022, 05:21 PM IST
Innova Hycross vs XUV 700: ఇన్నోవా హైక్రాస్, ఎక్స్‌యూవీ 700 ఏది మంచిది, ఆ వివరాలు మీ కోసం

ఇప్పుడు మార్కెట్‌లో హల్‌చల్ రేపుతున్న మరో రెండు భిన్న కంపెనీల కార్ల గురించి పరిశీలిద్దాం. ఒకటి ఇన్నోవా హైక్రాస్ అయితే రెండవది ఎక్స్‌యూవీ 700. టయోటా వర్సెస్ మహీంద్రా కంపెనీల రెండు మోడల్స్ గురించి వివరంగా పరిశీలిద్దాం..

పరిమాణంలో

మార్కెట్‌లో కొత్తగా వస్తున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ స్ట్రాంగ్ హైబ్రీడ్ వేరియంట్ ఇప్పటికే అందుబాటులో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కు పోటీ ఇస్తోంది. ఎక్స్‌యూవీ కంటే ఇన్నోవా హైక్రాస్ పరిమాణంలో పెద్దది. ఇన్నోవా హైక్రాస్ 95 ఎంఎం పొడవు ఎక్కువ కాగా, వెడల్పులో మాత్రం 44 ఎంఎం తక్కువే. ఎత్తు విషయంలో ఇన్నోవా హైక్రాస్ ఎక్కువ. కారు లోపల బూట్ స్పేస్ కూడా ఇన్నోవా హైక్రాస్ దే ఎక్కువ.

మూడు వరుసల సీటింగులో ఇన్నోవా హైక్రాస్ తొలిసారిగా పానారోమిక్ సన్‌రూఫ్, 10 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇస్తోంది. తొలిసారిగా అట్టామాన్ రిక్లైనింగ్ సీట్లు ఇందులో ప్రత్యేకత. పవర్డ్ టెయిల్ గేట్స్ కూడా ఉన్నాయి. ఇక యాపిల్, ఆండ్రాయిడ్ కార్ ప్లే రెండింట్లోనూ ఉన్నాయి.

ఇంజన్ విషయంలో

మహీంద్రా ఎక్స్‌యూవీ వర్సెస్ ఇన్నోవా హైక్రాస్ రెండూ 2 లీటర్ల పెట్రోల్ ఇంజన్స్‌తో వస్తున్నాయి. ఎక్స్‌యూవీ 700 లో టర్బో ఇంజన్ ఉంటే..ఇన్నోవా హైక్రాస్‌లో పెట్రోల్ హైబ్రీజ్ ఇంజన్ ఉంటుంది. ఇన్నోవా హైక్రాస్‌లోని 2 లీటర్ పెట్రోల్ ఇంజన్..174 పీఎస్ పవర్, 205 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగలదు. అదే మహీంద్రా ఎక్స్‌యూవీ 700 లోని 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే 200 పీఎస్ పవర్, 380 ఎన్‌ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 

మైలేజ్ ఎలా

ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ వేరియంట్ మైలేజ్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. హైబ్రీడ్ వేరియంట్ మాత్రం లీటర్‌కు 21 కిలోమీటర్లు ఇస్తుందని ఆ సంస్థ చెబుతోంది. అదే ఎక్స్‌యూవీ 700 పెట్రోల్ వేరియంట్ 15-16 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 

ధర ఎంత

మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ధర 13.45 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇన్నోవా హైక్రాస్ ధర ఎంతనేది ఇంకా తెలియలేదు. ఇన్నోవా హైక్రాస్ బుకింగ్స్ మాత్రం ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Also read: Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన పథకంలో కీలక మార్పులు.. తప్పక తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News