SBI PMJDY account holders with RuPay debit cards: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపే డెబిట్ కార్డులను ఉపయోగించే జన్ ధన్ ఖాతాదారులకు (Jan Dhan account holders with RuPay card) కాంప్లిమెంటరీ యాక్సిడెంటల్ కవర్ కింద రూ .2 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తోంది. డెబిట్ కార్డ్ వినియోగదారులందరూ (Debit card holders) ప్రమాదవశాత్తుగా మరణిస్తే వర్తించే బీమా, పర్చేస్ ప్రొటెక్షన్ కవర్ సహా వివిధ ప్రయోజనాలకు అర్హులు అవుతారని ఎస్బీఐ వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పౌరులకు బ్యాంకు సేవలు చేరువ చేసే లక్ష్యంతో 2014 ఆగస్టు 28న ప్రధాన మంత్రి జన ధన్ యోజన (PMJDY) ఖాతాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. రెమిటెన్స్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెన్షన్, బ్యాంకింగ్ సేవింగ్స్, డిపాజిట్ అకౌంట్లతో సహా వివిధ ఆర్థిక సేవలను ఖాతాదారులకు చేరువ చేయడం ప్రధాన మంత్రి జన ధన్ యోజన ఖాతాల వెనుకున్న ప్రధాన లక్ష్యం. నో యువర్ కస్టమర్ పత్రాలను (KYC documents) అందించడం ద్వారా ఏ భారతీయ పౌరుడైనా ఆన్‌లైన్‌లో జన్ ధన్ ఖాతాను తెరవవచ్చు. ఇప్పటికే వినియోగిస్తున్న ప్రాథమిక పొదుపు ఖాతాను కూడా జన ధన్ యోజన ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం ఉంది.


Also read : Bank Jobs Notification 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు, నోటిఫికేషన్ విడుదల


ఎస్బీఐలో జన్ ధన్ ఖాతా (Jan dhan khaata) ఉన్నవారు ఎవరైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూపే పిఎమ్‌జెడివై (RuPay PMJDY card) కార్డు పొందవచ్చు. ఆగష్టు 28, 2018 కి ముందు తెరిచిన జన ధన్ ఖాతాలతో రూపే పిఎమ్‌జెడివై కార్డులు పొందిన వారు రూ .1 లక్ష వరకు యాక్సిడెంటల్ కవర్ ఉండగా, 2018 ఆగస్టు 28 తర్వాత నమోదైన కొత్త పిఎమ్‌జెడివై ఖాతాలతో రూపే కార్డు కలిగిన వారికి రూ .2 లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంది.


Eligibility - అర్హతలు :
ప్రమాదం జరిగిన తేదీకి 90 రోజులలోపు ముందు రూపే డెబిట్ కార్డు ద్వారా ఏదైనా ఆర్థిక లేదా ఆర్థికేతర లావాదేవీలు జరిపిన జన్ ధన్ ఖాతాదారులకు ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. విదేశాల్లో జరిగే ప్రమాదాలకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. అవసరమైన డాక్యుమెంటేషన్ (Death insurance claim documents) సమర్పించిన తర్వాత 10 రోజుల్లో బీమా చేసిన మొత్తం ప్రకారం క్లెయిమ్ చెల్లించడం జరుగుతుంది. 


Also read: Smartphones Price In India: రూ.20 వేలలో లభ్యమవుతున్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే, మీరూ ఓ లుక్కేయండి


Nominee for PMJDY - పీఎంజేడీయూ నామినీ:
ఖాతాదారుడు నామినిగా పేర్కొన్న వారికి లేదా చట్టపరమైన వారసుడికి క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. 


కవర్ అయిన మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి సమర్పించాల్సిన డాక్యుమెంట్స్:


ప్రమాదవశాత్తుగా మరణించిన సందర్భంలో క్లెయిమ్ (Accidental death insurance claim) కోసం సమర్పించాల్సిన డాక్యుమెంట్స్ జాబితా ఇలా ఉంది.


1) పూర్తి వివరాలతో నింపి, సంతకం చేసిన క్లెయిమ్ ఫామ్ (Claim form).


2) మరణ ధృవీకరణ పత్రం (death certificate) అసలు కానీ లేదా ధృవీకరించిన కాపీ.


3) ప్రమాదం గురించి వివరణ ఇచ్చే ఎఫ్ఐఆర్ (FIR) లేదా పోలీసు రిపోర్టు అసలు లేదా ధృవీకరించిన కాపీ.


4) అవసరమైతే, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టుతో పాటు పోస్టుమార్టం రిపోర్ట్ (post mortem Report) ఒరిజినల్ లేదా సర్టిఫైడ్ కాపీ.


5) కార్డుదారుడు, నామినీకి చెందిన ఆధార్ కాపీలు (Aadhaar copies).


6) కార్డ్-ఇష్యూ చేసే బ్యాంకుల నుండి అధికారికంగా స్టాంప్ వేసి సంతకం చేసి ఇచ్చిన డిక్లరేషన్‌తో పాటు (ఎ) కార్డ్ హోల్డర్ రూపే కార్డు (RuPay card holders) కలిగి ఉన్నారని తెలియజేసే 16 అంకెల కార్డ్ నంబర్‌ను పేర్కొనాల్సి ఉంటుంది (బి) షరతుల ప్రకారం ఘటనకు జరగడానికి ముందు 90 రోజులలోపు రూపే కార్డుతో లావాదేవీలు (RuPay bebit card transactions) జరిపినట్టుగా బ్యాంక్ నుండి ఖాతా స్టేట్మెంట్, (సి) నామినీ పేరు అతని బ్యాంకింగ్ వివరాలు తెలియజేసే పాస్ బుక్ కాపీ, (డి) ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ ఇంగ్లీష్ లేదా హిందీలో అనువదించిన ఎఫ్ఐఆర్ కాపీ (ఇ) బ్యాంక్ అధికారి పేరు, ఇమెయిల్ ఐడీతో సహా సంప్రదింపు వివరాలు.


Also read : SBI Doorstep Banking Service: కరోనా నేపథ్యంలో ఖాతాదారులకు ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం, అర్హత, ఛార్జీల పూర్తి వివరాలు


గమనిక: క్లెయిమ్ దరఖాస్తు (Insurance claims) స్వీకరించిన తేదీ నుండి పది వర్కింగ్ డేస్‌లో క్లెయిమ్‌లు పరిష్కరించడం జరుగుతుంది. మార్చి 31, 2022 వరకు ఈ రూపే కార్డు కలిగిన జన్ ధన్ ఖాతాదారులకు ఈ బెనిఫిట్స్ (Jan Dhan account benefits) అందించనున్నట్టు ఎస్బీఐ వెల్లడించింది. రూపే పిఎమ్‌జెడివై కార్డుదారులకు బీమా విషయంలో ఎన్‌పిసిఐతో కలిసి న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇన్సూరెన్స్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.


Also read : Gold Price In Hyderabad 16th July 2021: మళ్లీ గాడిన పడుతున్న బులియన్ మార్కెట్, నేటి బంగారం, వెండి ధరలు ఇలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook