SBI New Rules: ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయల్ నియమాలు మారిపోయాయి. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎస్బీఐ కొత్త నిబంధలు ప్రవేశపెట్టింది. ఆ నిబంధనలేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలంటే ఇప్పుడు పాత పద్ధతి లేదు. ఏటీఎం నియమాల్లో మార్పు వచ్చింది. ఎస్బీఐ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. వినియోగదారుల భద్రత కోసం నిబంధనలు మార్చింది. ఆ కొత్త నియమాలేంటో పరిశీలిద్దాం..


ఎస్బీఐ ఏటీఎం నుంచి ఇకపై మీరు డబ్బులు విత్‌డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి కానుంది. ఇప్పుడిక కొత్త నియమాల ప్రకారం ఓటీపీ లేకుండా ఎస్బీఐ కస్టమర్లు డబ్బులు డ్రా చేయలేరు. క్యాష్ విత్‌డ్రా చేసే సమయంలో కస్టమర్లకు సంబంధిత రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే డబ్బులు విత్‌డ్రా చేయగలరు.


ఓటీపీ ఆధారిత విత్‌డ్రాయల్ సదుపాయం అనేది సైబర్ నేరగాళ్లు, మోసగాళ్ల పాలిట ఓ వ్యాక్సిన్ లాంటిదని ఎస్బీఐ అధికారికంగా ట్వీట్ ద్వారా వెల్లడించింది. మిమ్మల్ని అంటే కస్టమర్లను మోసాల్నించి కాపాడటమే ఎస్బీఐ ప్రధమ ప్రాధాన్యతగా తెలిపింది. ఓటీపీ ఆధారిత ఏటీఎం విత్‌డ్రాయల్ ఎలా పనిచేస్తుందనేది కస్టమర్లు తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్బీఐ స్పష్టం చేసింది. 


అయితే 10 వేలకంటే ఎక్కువ డబ్బులు డ్రా చేయాలంటేనే ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. పదివేల కంటే ఎక్కువ డబ్బులు ఎప్పుడు డ్రా చేయాలన్నా సరే..డెబిట్ కార్డు పిన్‌తో పాటు..రిజిస్టర్ మొబైల్‌కు ఎస్బీఐ నుంచి వచ్చే ఓటీపీ తప్పకుండా ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు నాలుగంకెల ఓటీపీ వస్తుంది. ఇది ఒకసారికి మాత్రమే పనిచేస్తుంది. అంటే పదివేల కంటే ఎక్కువ డబ్బులు విత్‌డ్రా చేయాలంటే..ఇక నుంచి సంబంధిత రిజిస్టర్ మొబైల్ కూడా వెంట ఉండాల్సిందే.


ఎందుకీ కొత్త నియమాలు


వివిధ రకాలుగా ఏటీఎంల వద్ద జరుగుతున్న మోసాల్నించి వినియోగదారుల్ని రక్షించేందుకు ఈ కొత్త నిబంధనలు తప్పనిసరి అవుతున్నాయి. దేశంలో 71 వేల 705 బీసీ అవుట్‌లెట్స్, 22 వేల 224 శాఖలు, 63 వేల 906 ఏటీఎంలతో ఎస్బీఐ అతిపెద్ద నెట్‌వర్క్ కలిగి ఉంది.


Also read: Gas Cylinder Price: మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర, డొమెస్టిక్ సిలెండర్ ధర ఇప్పుడు వేయి రూపాయలు పైనే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.