Amrit Kalash Deposit Scheme: ప్రజలు పొదుపు చేసుకునే సొమ్ముపై అన్ని బ్యాంకులు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తద్వారా ప్రజలు తమ డబ్బును బ్యాంకుల్లో వివిధ పథకాలలో డిపాజిట్ చేసుకుని.. మంచి రాబడి పొందవచ్చు. ఈ క్రమంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల కొత్త పథకం తీసుకువచ్చింది. ఇందులో మంచి వడ్డీని అందజేస్తోంది. అధిక వడ్డీ రేట్లతో కొత్త ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని ప్రకటించింది ఎస్‌బీఐ. సాధారణ కేటగిరీ పెట్టుబడిదారులతో పాటు సీనియర్ సిటిజన్లకు కూడా ఈ పథకం అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ ప్రకటించింది. అయితే ఇది లిమిట్ పిరియడ్ ఆఫర్ అని.. వచ్చే నెలలో ముగుస్తుందని వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమృత్ కలాష్ డిపాజిట్ పేరుతో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఈ పథకంలో ఆకర్షణీయమైన వడ్డీ రేటు.. 400 రోజుల కాలవ్యవధి ఉంటుందని పేర్కొంది. దేశీయ, ఎన్ఆర్ఐ కస్టమర్ల కూడా అమృత్ కలాష్ డిపాజిట్ పథకం అందుబాటులో ఉంటుందని చెప్పింది. సాధారణ కేటగిరీ పెట్టుబడిదారులతో పాటు సీనియర్ సిటిజన్లు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది.


ఈ కొత్త డిపాజిట్ పథకం ఈ నెల 15వ తేదీ నుంచి మార్చి 31, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రజలు ఈ మధ్య కాలంలో తమ పెట్టుపెడి ప్రారంభించవచ్చు. అమృత్ కలాష్ డిపాజిట్ పథకం కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీని అందిస్తుండగా.. ఇతరులకు 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం 400 రోజుల కాలవ్యవధిలో ముగుస్తుంది. మెచ్యూరిటీపై వడ్డీ చెల్లించనుంది ఎస్‌బీఐ. ఈ పథకంలో ఆదాయపు పన్ను చట్టం ప్రకారం టీడీఎస్ వర్తిస్తుంది.


 




అంతేకాకుండా ఎవరైనా 400 రోజుల కంటే ముందుగా నగదు ఉపసంహరించుకోవాలనుకుంటే.. విత్ డ్రా చేసుకోవచ్చు. కొత్త అమృత్ కలాష్ డిపాజిట్లపై ముందస్తు ఉపసంహరణ, లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ బ్యాంక్ వెల్లడించింది. ఈ మేరకు వివరాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ పథకం ఎస్‌బీఐ యోనో, లైఫ్‌స్టైల్‌లో అందుబాటులో లేదని తెలిపింది. 


Also Read: IPL 2023: రాజస్థాన్ రాయల్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఆసుపత్రి బెడ్‌పై టీమిండియా స్పీడ్ స్టార్  


Also Read: Geetha Singh: రోడ్డు ప్రమాదంలో హాస్యనటి గీతాసింగ్ కుమారుడు మృతి  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి