SBI: ఖాతాదారులకు మరింత చేరువయ్యేందుకు ఎస్‌బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. తాజాగా ఖాతాదారులకు సురక్షిత లావాదేవీలు అందుబాటులో ఉంచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంది. ఈక్రమంలో ఏటీఎం కేంద్రాల్లో డెబిట్ కార్డుల ద్వారా నగదు విత్‌డ్రా  చేసేందుకు వన్‌టైం పాస్‌వర్డ్(ఓటీపీ)ని తప్పనిసరి చేసింది. ప్రతి కేంద్రంలో ఓటీపీ తప్పనిసరి అని తేల్చి చెప్పింది. డిజిట్ లావాదేవీలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ అధికారులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక యుగంలో సైబర్ మోసాలు పెరుగుతుండటంతో మరింత భద్రత కోసం నాలుగు అంకెల ఓటీపీ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దేశంలోని ప్రతి ఎస్‌బీఐ కేంద్రంలో రూ.10 వేలు విత్‌డ్రా చేసుకోవాలంటే ఓటీపీ తప్పనిసరి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్‌ ఖాతాకు లింక్‌ అయిన మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్‌ను ఏటీఎం మిషన్‌లో ఎంటర్ చేయగానే బ్యాంకు లావాదేవీలకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. 


ఇకపై ఏటీఎం కేంద్రాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా డెబిట్ కార్డుతోపాటు మొబైల్ ఫోన్‌ తీసుకెళ్లాలి. ఏటీఎం మిషన్‌లో ఓటీపీని సరిగ్గా నమోదు చేయకుంటే నగదు లావాదేవీలను జరగవు. అంటే క్యాష్‌ విత్‌డ్రా చేసుకోలేము. ఒక ఓటీపీతో ఒకసారి మాత్రమే బ్యాంక్‌ లావాదేవీలను జరుపుకునే అవకాశం కల్పించారు. మరోవైపు ఎస్‌బీఐ ఖాతాదారులు తమ బ్యాంక్‌ ఏటీఎం కేంద్రాల్లో ఒక నెలలో ఐదు సార్లు వరకు ఉచితంగా నగదు విత్‌ డ్రా చేసుకునే వీలు ఉంది. ఇతర బ్యాంక్‌ల వద్దకు వెళ్తే మాత్రం నెలలో మూడు సార్ల వరకు ఉచితంగా నగదు విత్‌ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. 


Also read:Hyderabad Rains: హైదరాబాద్‌లో రెయిన్ అలర్ట్..రాగల రెండు గంటల పాటు బీఅలర్ట్..!


Also read:VANPIC: వాన్‌పిక్ కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ కొట్టివేత..తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.!   



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook