VANPIC: వాన్‌పిక్ కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ కొట్టివేత..తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.!

VANPIC: వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈకేసు సంబంధించి తాజాగా తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Written by - Alla Swamy | Last Updated : Jul 28, 2022, 08:23 PM IST
  • వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసు
  • తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
  • నిమ్మగడ్డ ప్రసాద్‌కు ఊరట
VANPIC: వాన్‌పిక్ కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ కొట్టివేత..తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.!

VANPIC: వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వైఎస్ హయాంలో ఉమ్మడి ఏపీలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కోసం వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌కు భూముల కేటాయింపు జరిగింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూముల కేటాయింపుపై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈక్రమంలోనే హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. 

ఛార్జ్‌షీట్ చెల్లదంటూ హైకోర్టులో సదరు సంస్థ క్వాష్‌ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు భారీ ఊరట లభించింది. ఏపీ సీఎం జగన్‌ అక్రమ ఆస్తుల కేసుల్లో ఈ అంశం ప్రధానంగా ఉంది. ఈకేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్ విచారణకు అర్హత లేదని స్పష్టం చేసింది. ఈసందర్భంగా సీబీఐ ఛార్జ్‌షీట్‌ను కొట్టివేసింది. 

దీంతో ప్రాజెక్ట్‌ ప్రమోటర్లుగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్, సీఎం జగన్‌తోపాటు పలువురికి పరోక్షంగా ఉపశమనం కల్గినట్లు అయ్యింది. హైకోర్టు తీర్పుపై సీబీఐ తదుపరి చర్యలు ఉంటాయా అన్న దానిపై క్లారిటీ లేదు. సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్‌ కోసం 2008లో అప్పటి ప్రభుత్వం వాన్‌పిక్‌కు భూములు కేటాయించింది. ఐతే ఇందులో అక్రమాలు జరిగాయని సీబీఐ కేసులు నమోదు చేసింది. 

హైకోర్టు తీర్పుతో ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ తలపెట్టిన ఇండస్ట్రియల్ కారిడార్‌కు అంతా క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈకేసుపై పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ గత 10 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. 

Also read:CM Kcr: హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో మణిహారం..పోలీస్ టవర్స్‌ ప్రారంభించనున్న సీఎం..!

Also read:Hyderabad Rains: హైదరాబాద్‌లో రెయిన్ అలర్ట్..రాగల రెండు గంటల పాటు బీఅలర్ట్..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News