Hyderabad Rains: హైదరాబాద్‌లో రెయిన్ అలర్ట్..రాగల రెండు గంటల పాటు బీఅలర్ట్..!

Hyderabad Rains: హైదరాబాద్‌లో ముసురు పట్టుకుంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో భారీ వర్షం పడుతోంది. దీంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది.

Written by - Alla Swamy | Last Updated : Jul 28, 2022, 07:57 PM IST
  • హైదరాబాద్‌లో ముసురు
  • పలు ప్రాంతాల్లో భారీ వర్షం
  • అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ
Hyderabad Rains: హైదరాబాద్‌లో రెయిన్ అలర్ట్..రాగల రెండు గంటల పాటు బీఅలర్ట్..!

Hyderabad Rains: హైదరాబాద్‌లో వరుణుడి శాంతించడం లేదు. ఉదయం వేళలో పొడి వాతావరణం కొనసాగుతుండగా..సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. సుమారు గంట నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, షేక్‌పేట్, టోలీచౌకి, రాయదుర్గం, షాపూర్ నగర్, చింతల్, గాంజులరామారం ప్రాంతాల్లో కుండపోత కురిసింది. 

చందానగర్, శేరిలింగంపల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, సోమాజిగూడ, కొండాపూర్‌తోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. క్షేత్ర స్థాయిలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. డ్రైనేజీని ఎప్పటికప్పుడు సరి చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మీ ఆదేశించారు.  

తెలంగాణలో రాగల మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే సూచించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల  ఎత్తు వరకు కేంద్రీకృతమైంది. నిన్న ఆంధ్రప్రదేశ్‌ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆవర్తనం ఇవాళ మరింత క్షిణించింది. మరోవైపు ఉత్తర-దక్షిణ ద్రోణి..ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ ఇంటీరియల్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు కేంద్రీకృతమైంది. 

వీటి ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి మాత్రం తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండటంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. కృష్ణ, గోదావరి, తుంగభద్ర, వాటి ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 

Also read:CM Kcr: హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో మణిహారం..పోలీస్ టవర్స్‌ ప్రారంభించనున్న సీఎం..!

Also read:IND vs WI: పొట్టి సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ..జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News