SBI Superhit Scheme: సూపర్ హిట్ స్కీమ్, 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తరువాత 21 లక్షలు
SBI Superhit Scheme: సీనియర్ సిటిజన్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ అందిస్తోంది. పదేళ్లలో రెట్టింపు డబ్బు పొందే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఎస్బీఐ అందిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ పధకం ద్వారా ఇది సాధ్యం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SBI Superhit Scheme: సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ 7 రోజుల్నించి 10 ఏళ్లకు వర్తించే అద్భుతమైన వడ్డీతో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తోంది. రిటైర్ అయిన ఉద్యోగులకు రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ ఇచ్చే పధకమిది. ఈ పధకంలో 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లకు 21 లక్షలౌతుంది.
సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ రిస్క్ లేని ఇన్వెస్ట్‌మెంట్ వైపే అందరూ ఆసక్తి కనబరుస్తుంటారు. రిస్క్ ఉన్నచోట పెట్టుబడి పెట్టాలని ఎవరూ అనుకోరు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు అస్సలు రిస్క్ తీసుకోరు. అందుకే వివిధ బ్యాంకులు, పోస్టాఫీసులు సీనియర్ సిటిజన్ల కోసం డిపాజిట్ పథకాలు ఆఫర్ చేస్తున్నాయి. అందులో ఒకటి ఎస్బీఐ ఆఫర్ చేస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ పధకం. ఇటీవల రిటైర్ అయిన సీనియర్ సిటిజన్లకు ఇది అద్భుతమైన పధకం. ఎస్బీఐ అదికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం సీనియర్ సిటిజన్లు ఎస్బీఐలో 7 రోజుల్నించి 10 ఏళ్ల వ్యవధికి డిపాజిట్ చేయవచ్చు. ఇతరులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు వడ్డీ 0.50 శాతం అధికంగా లభిస్తుంది. అదే 5-10 ఏళ్ల వ్యవధికైతే ఎస్బీఐ ఇతరుల కంటే 1 శాతం అధిక వడ్డీ అందిస్తుంది.
ఎస్బీఐ వెబ్‌సైట్ ప్రకారం సాధారణ పౌరులు 5-10 ఏళ్ల కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. కానీ సీనియర్ సిటిజన్లకు మాత్రం ఇదే కాలవ్యవధికి 7.5 శాతం వడ్డీ అందిస్తోంది.
ఒక సీనియర్ సిటిజన్ ఎవరైనా 10 లక్షల రూపాయలు 10 ఏళ్ల కాల వ్యవధిపై ఎస్బీఐలో డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం 7.5 శాతం వడ్డీ లెక్కిస్తే మొత్తం 21 లక్షల 2 వేల 349 రూపాయలు చేతికి అందుతుంది. అంటే కేవలం వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం 11 లక్షల 2 వేల 349 రూపాయలు. గత ఏడాది డిసెంబర్ 27 నుంచి ఎస్బీఐ 2 కోట్ల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లపై 0.25 శాతం వడ్డీ పెంచింది.
రిస్క్ లేని ఇన్వెస్ట్‌మెంట్ కోరుకునేవారికి ఫిక్స్డ్ లేదా టర్మ్ డిపాజిట్ మంచి ప్రత్యామ్నాయం. ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80సి ప్రకారం 5 ఏళ్ల ఎఫ్‌డిపై ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. అయితే మీ ఎఫ్‌డిపై వచ్చే వడ్డీని ఆదాయం కింద పరిగణించి దానిపై ట్యాక్స్ విధిస్తుంది ఇన్‌కంటాక్స్ శాఖ. ట్యాక్స్ మినహాయింపు కోసం ఫామ్ 15జి లేదా ఫామ్ 15హెచ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Also read: Best Smartphones: 8 జీబీ ర్యామ్, 30 నిమిషాల్లో ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం 7 వేలకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook