Best Smartphones: 8 జీబీ ర్యామ్, 30 నిమిషాల్లో ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం 7 వేలకే

Best Smartphones: తక్కువ బడ్జెట్‌లో అత్యధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే. అద్భుతమైన ఫీచర్లు, వేగవంతమైన పనితీరు కలిగిన స్మార్ట్‌ఫోన్ నమ్మశక్యం కాని ధరకు లభ్యమౌతోంది. పూర్తి వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 6, 2024, 05:13 PM IST
Best Smartphones: 8 జీబీ ర్యామ్, 30 నిమిషాల్లో ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం 7 వేలకే

Best Smartphones: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రోజురోజుకూ కొత్త కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఫీచర్, బ్రాండ్‌ను బట్టి ధర మారుతుంటుంది. ఈ క్రమంలో 8 జీబీ ర్యామ్, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 128 జీబీ స్టోరేజ్ ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కనీసం 15 వేలకుపైనే ఉంటుంది. కానీ మీ కోసం బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ అందులో సగం ధరకే లభించనుంది. 

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా లాంచ్ చేసిన Lava Yuva అద్భుతమైన ఫీచర్లు కలిగిన చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ ర్యామ్ 8జీబీ కాగా, స్టోరేజ్ 128 జీబీ ఉంటుంది. ఇక 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అటు బ్యాటరీ సామర్ధ్యం 5000 ఎంఏహెచ్ ఉంటుంది. ఇటీవలే లావా కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర కేవలం 6,799 రూపాయలు మాత్రమే. నమ్మశక్యంగా లేదు కదా..నిజమే. ఇందులో స్టోరేజ్, ప్రోసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లు ఉన్నాయి. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంది. అటు ఇన్‌ఫినిక్స్ సైతం ఇదే ధరలో అద్భుతమైన ఫోన్ ఆఫర్ చేస్తోంది. 

Lava Yuva 3 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో ఉంటుంది. ఈ ఫోన్ ధర 6,799 రూపాయలుంది. కాగా 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ఫోన్ 7,299 రూపాయలుంది. ఇక ఇన్‌ఫినిక్స్ కంపెనీ కూడా Infinix SMART 8 కేవలం 6,299 రూపాయలకే అందిస్తోంది. Lava Yuva 3లో ప్రీమియం బ్లాక్ డిజైన్ ఉంది. అందుకే ఈ ఫోన్ నేరుగా Infinix SMART 8కు గట్టి పోటీ ఇస్తోంది. ఇందులో సైడ్ మౌంటెండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 

Lava Yuva 3 స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన UNISOC T606 ప్రోసెసర్ వల్ల పనితీరు చాలా బాగుంటుంది. 6.5 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ 5 హోల్ డిస్‌ప్లే డిజైన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. అదే ఇన్ఫినిక్స్‌లో ఆపిల్ డైనమిక్ ఐల్యాండ్ అనుభూతి లభిస్తుంది. ఇక 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా బ్యాటరీ సామర్ధ్యం 5000 ఎంఏహెచ్ ఉంటుంది. 

Also read: CBSE Admit Card 2024: సీబీఎస్ఈ 10, 12 తరగతి అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ ఎలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News