SBI Alert: దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన అలర్ట్ జారీ చేసింది. కొన్నిరకాల లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దంటుంది. లేదంటే ఇంతే సంగతులట..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎక్కడ విన్నా..ఎటు చూసినా ఆన్‌లైన్ మోసాలు ఎక్కువైపోయాయి. సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడి సర్వం కోల్పోతున్న పరిస్థితులు అధికమౌతున్నాయి. ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది. కేవైసీ ముసుగులో ఎదురవుతున్న మోసానికి సంబంధించి ఎస్బీఐ 44 కోట్లమంది కస్టమర్లను ఎస్బీఐ అప్రమత్తం చేసింది. టెక్స్ట్ మెస్సేజ్ ద్వారా వచ్చే..ఎంబెడెడ్ లింక్‌లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని ఎస్బీఐ వినియోగదారులను హెచ్చరిస్తోంది. 


వినియోగదారుల అవగాహన కోసం కొన్ని సూచనలు జారీ చేసింది. ఎంబెడెడ్ లింక్స్‌పై క్లిక్ చేయడం ద్వారా కేవైసీ అప్‌డేట్ చేయమని ఎస్ఎంఎస్‌ల ద్వారా ఎప్పుడూ అడగమని ఎస్బీఐ స్పష్టం చేసింది. అందుకే ఎప్పుడు అటువంటి లింక్‌లు వచ్చినా రెస్పాండ్ కావద్దంటోంది. దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగేకొద్దీ..ఆన్‌లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. ఈ తరుణంలో ఎస్బీఐ ఎప్పటికప్పుడు వినియోగదారుల్ని అప్రమత్తం చేస్తోంది. ఈ మేరకు ఎస్బీఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కస్టమర్లకు ట్వీట్ అలర్ట్ జారీ చేసింది. ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ఏ లింక్‌ను కూడా క్లిక్ చేయవద్దంటుంది. ఒకవేళ కేవైసీ అప్‌డేట్ చేయాల్సి వస్తే..ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా సమీపంలోని బ్యాంకు ద్వారా చేయమంటోంది. 


మరోవైపు క్యూఆర్ కోడ్‌ల ద్వారా జరుగుతున్న మోసాలపై కూడా కస్టమర్లను అలర్ట్ చేసింది. ఎవరి నుంచైనా క్యూఆర్ కోడ్ వస్తే..పొరపాటున కూడా స్కాన్ చేయవద్దని సూచిస్తోంది. అలా చేస్తే మీ అక్కౌంట్ నుంచి డబ్బులు పోతాయని హెచ్చరిస్తోంది. డబ్బులు తీసుకునేందుకు ఎప్పుడూ స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదనే అవగాహన కలిగి ఉండాలంటోంది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు ఈ విషయాల్ని తప్పకుండా గుర్తుంచుకోవాలంటోంది.


Also read: PAN-Aadhaar: గడువు ముగుస్తోంది పాన్​-ఆధార్​ లింక్​ చేశారా? ఇప్పుడే చెక్​ చేసుకోండి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook