OnePlus into Electric vehicles market: వన్​ ప్లస్.. అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది లగ్జరీ స్మార్ట్​ఫోన్లు, ఎలక్ట్రిక్ గాడ్జెట్లు. అయితే ఇప్పుడు వన్​ ప్లస్​ విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీ రంగంలోకి ప్రవేశించేందుకు కసరత్తు చేస్తుందని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భవిష్యత్ మొత్తం విద్యుత్ వాహనాలదే కానున్న నేపథ్యంలో వన్​ప్లస్​ కూడా ఈవీ మార్కెట్​పై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.


'వన్‌ప్లస్‌ లైఫ్' పేరుతో భారతదేశంలో ఆటోమోటివ్ కేటగిరీలోకి (One Plus into EV market) ప్రవేశించడానికి ట్రేడ్ మార్క్ కోసం దాఖలు చేసింది. దీని ద్వారా వన్​ప్లస్ ఈ మొబిలిటీ మార్కెట్లోకి ప్రవేశిస్తుందన్న వాదనకు మరింత బలం చేకూరింది.


Also read: Gold Price Today: బంగారం ప్రియులకు దంతేరాస్ పండుగ వేళ గుడ్‌న్యూస్, బంగారం ధర ఎంతంటే


Also read: Whats App Cash Back: వాట్సాప్ పేమెంట్స్‌లో రూ. 255 ఖచ్చితమైన క్యాష్‌బ్యాక్‌.. త్వరపడండి!


ప్రస్తుత పరిస్థితులూ కారణమేనా?


ప్రస్తుతం పెట్రోల్​, డీజిల్ రేట్లు (Fuel price in India) ఆకాశానంటుతున్నాయి. దీనికి తోడు శిలాజ ఇంధనాల వల్ల కాలుష్యం పెరిగిపోతోందని వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది విద్యుత్  వాహనాల కొనుగోలుపై దృష్టి సారిస్తున్నారు.


దీనితో ఇప్పటికే మార్కెట్లో ఉన్న కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. విద్యుత్ కార్ల మార్కెట్లో అతిపెద్ద కంపకెనీగా ఉన్నటెస్లా కూడా త్వరలోనే (Tesla to Indian Market) భారత్​లో కార్ల విక్రయాలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.


దేశీయంగా టాటా, మారుతీ సహా ఇతర దిగ్గజ సంస్థలన్నీ విద్యుత్ కార్లను తయారు చేస్తున్నాయి.


Also read: Facebook face-recognition tool: ఫేస్​బుక్ సంచలన నిర్ణయం- త్వరలో ఆ ఫీచర్​ మాయం!


Also read: Commercial LPG Price Today: కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్పై రూ.266 పెంపు.. రూ.2000లకు చేరిన సిలిండర్ ధర


ఈవీ మార్కెట్​పై స్మార్ట్​ఫోన్ కంపెనీల ఆసక్తి..


వన్​ప్లస్ కన్నా ముందు.. పలు స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థలు కూడా విద్యుత్ వాహనాల తయారీ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు సంకేతాలిచ్చాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యాపిల్ గురించి.


లగ్జరీ స్మార్ట్​ఫోన్ మర్కెట్లో దిగ్గజంగా వెలుగొందుతున్న యాపిల్​.. 2014 నుంచే ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ధి కోసం (Apple Electrice cars) కసరత్తు చేస్తోంది. వెయ్యి మంది నిపుణులతో ఈ ప్రాజెక్ట్​పై పని చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే.. 2024 నుంచి యాపిల్ కార్లు రోడ్లపై తిరిగే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు ఇటీవల వెల్లడించాయి.


ఆ తర్వాత.. చైనాకు చెందిన స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ షియోమీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల (Xiaomi Electric cars) ఉత్పత్తి తంగంలోకి ప్రవేశిస్తున్నట్లు తెలిసింది. దీనితో పాటు అదే దేశానికి చెందిన మరో కంపెనీ ఒప్పో (Oppo into EV market) కూడా విద్యుత్ వాహనాల తయారీపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఈ సంస్థ కూడా ఇటీవల 'ఒప్పో కార్​ ప్లస్​' పేరుతో ట్రేడ్ మార్క్​ కోసం దరఖాస్తు చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే.. దిగ్గజ స్మార్ట్​ఫోన్​ కంపెనీలన్నీ విద్యుత్ వాహనాల తయారీపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.


Also read: Diwali Offers: ముగింపు దశకు అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ దీపావళి ఆఫర్లు.. పూర్తి వివరాలు ఇవే


Also read: Diwali Offer: బంపరాఫర్.. కొత్త ఇంటర్నెట్ కనెనక్షన్లపై రూ. 500 డిస్కౌంట్