SBI Recruitment 2024: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 131 పోస్టుల భర్తీకై దరఖాస్తు ప్రక్రియ నడుస్తోంది. దరఖాస్తు చేసేందుకు మరో నాలుగురోజులు మాత్రమే గడువు మిగిలుంది. అప్లై చేసేముందు ఈ ఉద్యోగాలకు కావల్సిన అర్హత ఇతర వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి ఇదే మంచి అవకాశం. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. sbi.co.in.వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చ్ 4 చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు జీతం 63 వేల రూపాయలుంటుంది. ఉన్నత స్థాయి ఉద్యోగమైనందున అర్హత కలిగిన అభ్యర్ధులు తక్షణం అప్లై చేసుకోవచ్చు. మొత్తం 131 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏయే పోస్టులు ఎన్ని ఉన్నాయో...పరిశీలిద్దాం.


డిప్యూటీ మేనేజర్-సెక్యూరిటీ ఎనలిస్ట్ పోస్టులు 51
మేనేజర్-క్రెడిట్ ఎనలిస్ట్ పోస్టులు 50
అసిస్టెంట్ మేనేజర్-సెక్యూరిటీ ఎనలిస్ట్ పోస్టులు 23
మేనేజర్-సెక్యూరిటీ ఎనలిస్ట్ పోస్టులు 3
అసిస్టెంట్ జనరల్ మేనేజర్- అప్లికేషన్ సెక్యూరిటీ 3
సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ 1


ఎస్బీఐలో భర్తీ చేయనున్న స్పెషలిస్ట్ కేడర్ పోస్టులకు అప్లే చేసేందుకు అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్ధులు sbi.co.in. వెబ్‌సైట్ ద్వారా చేయవచ్చు. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేశాక, కెరీర్ లింక్ ఓపెన్ చేయాలి. అక్కడ్నించి రిక్రూట్‌మెంట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేసి మొత్తం అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. చివరిగా నిర్ధారిత రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్‌తో పాటే నిర్దారిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు లేకుండా సబ్మిట్ చేసే దరఖాస్తుల్ని తిరస్కరిస్తారు. 


Also read: Zee News-Matrize Survey: ఏపీలో ఈసారి అధికారం ఆ పార్టీదే, సంచలన సర్వే



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook