Stocks today: వారాంతంలో స్టాక్ మార్కెట్లకు నష్టాలు- 57,500 దిగువకు సెన్సెక్స్
Stocks today: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 233 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్లు కోల్పోయింది. అంతర్జాతీయ పరిణామాలు, చమురు ధరలు పెరుగుదల వంటివి ఇందుకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
Stocks today: స్టాక్ మార్కెట్లు వారాంతంలో నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ అనిశ్చితి, ముడి చమురు ధరలు, దేశీయంగా ధరల వృద్ధి వంటి కారణాలతో మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
బీఎస్ఈ-సెన్సెక్స్ 233 పాయింట్లు కోల్పోయి.. 57,362 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 70 పాయింట్లు పెరిగి 17,153 వద్దకు దిగొచ్చింది.
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతుండటం ఆందోళనలు కలిగిస్తున్న ప్రధానాంశం. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంపగా పడుతోంది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సూచీల కదలికలు ఇలా..
ఇంట్రాడేలో సెన్సెక్స్ 57,845 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. 57,100 కనిష్ఠానికీ పడిపోయింది.
నిఫ్టీ అత్యధికంగా 17,294 పాయింట్ల స్థాయిని తాకింది. అత్యల్పంగా 17,076 స్థాయిని కూడా చేరింది.
నేటి సెషన్లో టాప్-5 షేర్లు..
డాక్టర్ రెడ్డీస్ 0.77 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.76 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.73 శాతం, భారతీ ఎయిర్టెల్ 0.72 శాతం, ఎస్బీఐ 0.63 శాతం లాభపడ్డాయి.
టైటాన్ 3.59 శాతం, టెక్ మహీంద్రా 2.35 శాతం, మారుతీ 1.79 శాతం, విప్రో 1.18 శాతం, ఎల్ అండ్ టీ 1.14 శాతం నష్టపోయాయి.
Also read: Flipkart mobile fest: ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ సేల్.. అన్ని ఫోన్లపై భారీ తగ్గింపు!
Also read: Realme C31: రియల్మీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్- తక్కువ ధరలోనే అదిరే ఫీచర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook