కరోనా వైరస్ ( Corona virus ) కు మార్కెట్‌ను పడగొట్టడం తెలుసు. లేపడం కూడా తెలుసు. కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై ప్రఖ్యాత అమెరికన్ కంపెనీ ఫైజర్ చేసిన ప్రకటన సంజీవినిలా పని చేసింది. ఒక్కసారిగా షేర్ మార్కెట్ పుంజుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ప్రజలు గజగజలాడుతున్నారు. అమెరికాలో రోజుకు లక్షకు పైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా పడిపోయినట్టే అగ్రరాజ్యంలో కూడా మార్కెట్ నాశనమైంది. మరోవైపు కరోనా వైరస్ కట్టడికి ప్రముఖ కంపెనీల వ్యాక్సిన్‌లు దాదాపుగా మూడవ దశ ప్రయోగాల్ని పూర్తి చేసుకునే దశలో ఉన్నాయి. ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ -ఆస్ట్రాజెనెకా( Oxford-AstraZeneca ) అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఉత్పత్తిని ఆస్ట్రేలియా ( Australia ) లోని సీఎస్ఎల్ లిమిటెడ్ ( CSL Limited ) ఇవాళ ప్రారంభించింది. మరోవైపు ఇవాళ ప్రఖ్యాత అమెరికన్ కంపెనీ ఫైజర్ ( Pfizer company )  కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) పై గుడ్‌న్యూస్ అందించింది. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మూడవ దశ ప్రయోగాల్లో 90 శాతం అద్భుత ఫలితాలు సాధించినట్టు ప్రకటించి కొత్త ఆశలు రేపింది.


కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై ఫైజర్ కంపెనీ చేసిన ప్రకటనతో మార్కెట్‌లో ఒక్కసారిగా ఊపు కన్పించింది. ఫైజర్ ప్రకటనతో అమెరికాలోని స్టాక్ మార్కెట్లు ( American stock markets ) దూసుకుపోయాయి. అమెరికాలోని డోజోన్స్  (Dozone index ) 15 వందల పాయింట్లు పుంజుకుంది. ఎస్ అండ్ పి ( S&P ), నాస్‌డాక్ ( Nasdaq ) సైతం ఇలాగే పురోగతి సాధించాయి. యూకే మార్కెట్ ఎఫ్ టీ ఎస్ ఈ 100 ( FTSE 100 ) కూడా 4 శాతం పైకి ఎగిసింది. ఇతర యూరోపియన్ మార్కెట్లు 5 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇంచుమించు అన్నిరంగాల్లోని షేర్లలో భారీగా కొనుగోళ్లు కన్పించాయి. ప్రధానంగా ట్రావెల్ సంస్థలు పుంజుకున్నాయి. బ్రిటీష్ ఎయిర్ వేస్ ఓనర్ అయిన ఐఏజీ ( IOG ) ఒకేసారి 26 శాతం పెరుగుదల నమోదు చేసింది. 


ప్రఖ్యాత అమెరికన్ కంపెనీ ఫైజర్..జర్మన్ కంపెనీ బయో ఎన్టెక్  ( Biontech ) తో కలిసి వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ మూడవ దశ ప్రయోగాలు 90 శాతం సక్సెస్ అయ్యాయని ప్రకటించడమే స్టాక్ మార్కెట్ పుంజుకోడానికి కారణం. నవంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులో తీసుకొస్తామని గతంలోనే ఫైజర్ ప్రకటించిన పరిస్థితి. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే కీలకమైన మూడవ దశ ప్రయోగాలు 90 శాతం సక్సెస్ అయ్యాయని ప్రకటించడంతో మార్కెట్ కళకళలాడింది. Also read: Corona vaccine: ఫైజర్ వ్యాక్సిన్ 90 శాతం సక్సెస్..ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభం