Success Story: ఆమె సంకల్పం ముందు పేదరీకం ఓడింది.. ఆర్థిక కష్టాల్లో నుంచి పుట్టిన ఒక ఆలోచన.. ఆమె జీవితాన్నే మార్చేసింది
Success Story: మనలో చాలా మంది చిన్న చిన్న సమస్యలకే భయపడుతుంటారు. తమకే అన్ని కష్టాలు వచ్చాయని ఆందోళన చెందుతుంటారు. కానీ..జీవితంలో బాగుపడాలన్నా..ఉన్నత స్థాయికి ఎదుగాలన్నా కష్టంతోపాటు బాధ్యత తప్పనిసరి. మనం చేసే పనిలో నిబద్ధత ఉంటే కొంత ఆలస్యం అయినా పర్లేదు విజయం మన వాకిట్లో నిల్చుంటుంది. విజయం సాధించాలంటే ఉన్నత చదువులు చదవక్కర్లేదు. కష్టపడేతత్వంతోపాటు పట్టుదల ఉంటే సరిపోతుందని నిరూపించింది ఓ మహిళ. నేడు కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలంటే..ఆమె సక్సెస్ స్టోరీ చదవాల్సిందే.
women empowerment: ఏ ఒక్కరి జీవితం కూడా పూలబాటలా ఉండదు. ప్రతి మనిషికి ముళ్ల బాట ఎదురువుతూనే ఉంటుంది. ఆ ముళ్ల బాటను దాటితే చేరుకునేది పూలబాటకే. ముళ్లబాటను పూలబాటగా మార్చుకునే శక్తి కూడా దేవుడు మనకే ఇస్తాడు. కానీ కొంతమంది మాత్రం చిన్న సమస్య వచ్చినా సరే..ప్రపంచంలో ఎవరికీ రాని కష్టం తనకే వచ్చినట్ల బాధపడుతుంటారు. ఆ బాధలో క్షణిక నిర్ణయాలు తీసుంటారు. కానీ ఆమె మాత్రం తనకు వచ్చిన కష్టాన్ని దిగమింగుకుని..నేడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించింది. కష్టాల్లో నుంచే అసలైన జీవితం షురూ అవుతుందని నిరూపించింది.
యూపీలోని బులంద్ షహర్ కు చెందిన క్రుష్ణయాదవ్. ఆమె సంపన్న కుటుంబంలో పుట్టలేదు. ఉన్నత చదువులు చదవలేదు. 1990వ సంవత్సరంలో ఆమె భర్త వ్యాపారంలో దివాళా తీశాడు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమయంలో వాళ్లు నివసిస్తున్న ఇంటిని కూడా అమ్మేశారు. ఆ తర్వాత స్నేహితుల దగ్గర 500 రూపాయలు అప్పుగా తీసుకుని బులంద్ సహర్ వదిలి ఢిల్లీకి బయలుదేరారు.
ఢిల్లీకి వెళ్లిన పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేదు. ఆమె భర్తకు ఏ ఉద్యోగం లభించలేదు. ఆ తర్వాత తన భర్త ముగ్గురు పిల్లలతో కలిసి వ్యవసాయం చేసి కూరగాయలు పండించారు. సాగు చేసిన కూరగాయలను సరిగ్గా అమ్మలేకపోయారు. ఆ తర్వాత ఊరగాయలు తయారు చేసి విక్రయించే ప్లాన్ చేశారు. దీంతో ఢిల్లీలోని ఉజ్వాగ్రామంలోని కృషి విజ్నాన కేంద్రంలో క్రుష్ణ యాదవ్ ట్రైనింగ్ తీసుకుంది. పచ్చళ్లు తయారు చేసేందుకు మొదట్లో రూ. 3వేలు పెట్టుబడి పెట్టారు. వీటిని ఆమె భర్త మొదట్లో రోడ్డు పక్కన విక్రయించారు. ఇలా క్రమంగా శ్రీ క్రుష్ణ పికిల్స్ సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం వీరు 150 రకాల పచ్చళ్లను విక్రయిస్తున్నారు.
క్రుష్ణయాదవ్ తాను ఎదగడమే కాదు..ఎంతోమంది మహిళలకు ఉపాధి అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఆమె టర్నోవర్ రూ. 5కోట్ల కంటే ఎక్కువే. వ్యాపార రంగంలో మెలకువలు నేర్చుకుని ఆ మెలకువలతోనే నేడు కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించింది. క్రుష్ణయాదవ్ క్రుషికి భారత ప్రభుత్వ మహిళా శిశుడెవలప్ మెంట్ మంత్రిత్వ శాఖ 2015లో నారీ శక్తీ సమ్మాన్ పురస్కారాన్ని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. అంతేకాదు భారత ప్రధాని నరేంద్రమోదీ సైతం స్వయంగా గౌరవనీయమైన ఎన్జీరంగా రైతు అవార్డును కూడా ప్రదానం చేశారు.
కృష్ణ భర్త, పెద్ద కొడుకు కూడా ఈ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. మరో ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఎప్పుడూ పాఠశాలకు హాజరుకాని కృష్ణను ఢిల్లీ పాఠశాలల్లో ఉపన్యాసాలు ఇవ్వడానికి ఆహ్వానించారంటే ఆమె సాధించిన విజయం అసాధారణమైంది. కృష్ణ యాదవ్ 2012లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నుండి అత్యుత్తమ మహిళా అవార్డుతో సహా అనేక అవార్డులను అందుకున్నారు. 2013లో గ్లోబల్ అగ్రికల్చర్ సమ్మిట్ సందర్భంగా వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు వినూత్న అవార్డు, 2014లో ప్రతిష్టాత్మక NG రంగా అవార్డును అందుకున్నారు.
చివరగా మనం నేర్చుకోవల్సింది ఏంటంటే..కష్టాలు వచ్చాయని బాధపడటం కంటే ఆ కష్టాల్లో నుంచి ఎలా బయటపడాలన్న ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. దేశంలోని ప్రపంచంలోని గొప్ప గొప్ప వాళ్లంతా కష్టాల్లోనుంచి విజయాన్ని సాధించినవాళ్లే. మనలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామన్న తపన ఉంటే ఎంతటి కష్టమోచ్చని అవలీలగా ఎదుర్కొంటాం. అనుకున్న విజయాన్ని సాధిస్తాం. క్రుష్ణయాదవ్ సక్సెస్ స్టోరీ ఎంతో మంది మహిళలకు స్పూర్తినిస్తుంది.
Also Read: Success Story: ఇడ్లీ, దోశ పిండితో వేల కోట్లు సంపాదించిన పి.సి ముస్తాఫా సక్సెస్ స్టోరీ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.