Tata Group IPOs: షేర్ మార్కెట్‌లో ఇప్పటికే చాలా కంపెనీలు లిస్ట్ అయున్నాయి. మరి కొన్ని కంపెనీలు త్వరలో లిస్టింగ్ కానున్నాయి. ఈ క్రమంలో టాటా గ్రూప్ నుంచి ఇన్వెస్టర్లకు శుభవార్త అందుతోంది. త్వరలో టాటా గ్రూప్ నుంచి భారీగా ఐపీవోలు ఇష్యూ అవబోతున్నాయి. టాటా గ్రూప్ నుంచి ఐపీవో అంటే 20 ఏళ్ల తరువాత ఇటీవల వచ్చిన టాటా టెక్నాలజీస్ తరువాత ఇదే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాటా గ్రూప్ అంటేనే ఓ నమ్మకం. అందుకే లాభాలు మరీ భారీగా లేకున్నా ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తుంటారు. టాటా గ్రూప్ నుంచి ఐపీవో వచ్చిందంటే ఎగబడుతుంటారు. అలాంటిది 20 ఏళ్ల విరామం తరువాత ఇటీవల ఒకే ఒక ఐపీవో టాటా టెక్నాలజీస్ ఇష్యూ అయింది. ఇప్పుడు త్వరలో పెద్దఎత్తున టాటా గ్రూప్ నుంచి కొన్ని ఐపీవోలు మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాయని తెలుస్తోంది.షేర్ మార్కెట్ సమాచారం ప్రకారం టాటా కేపిటల్, టాటా ఆటో కాంప్ సిస్టమ్స్, టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, టాటా బిగ్ బాస్కెట్, టాటా డిజిటల్, టాటా ఎలక్ట్రానిక్స్, టాటా హౌసింగ్, టాటా బ్యాటరీస్ కంపెనీలు ఐపీవో ప్రవేశపెట్టనున్నాయి. అటు టాటా గ్రూప్ కూడా తన వ్యాపారాన్ని డిజిటల్, రిటైల్, సెమీకండక్టర్స్, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ రంగాలకు విస్తరించాలని ఆలోచిస్తోంది. 


ఇటీవల అంటే 2023లో విడుదలైన టాటా టెక్నాలజీస్ కంటే ముందు చివరిసారిగా 2004లో విడుదలైన ఐపీవో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. రానున్న 2-3 ఏళ్లలో టాటా గ్రూప్ నుంచి 6-8 పబ్లిక్ ఇష్యూస్ మార్కెట్‌లో రానున్నాయి. ప్రస్తుతం ఇండియన్ షేర్ మార్కెట్‌లో రెండవ అతిపెద్ద కంపెనీ టీసీఎస్ మాత్రమే. టాటా గ్రూప్ నుంచి త్వరలో 6-8 ఐపీవోలు రానున్నాయనే వార్తల నేపధ్యంలో గ్రూప్ షేర్లు 5 శాతం పెరిగాయి. 


Also read: Gopalpur Port: అదానీ చేతికి మరో పోర్టు, 1349 కోట్లకు 95 శాతం వాటా కొనుగోలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook