Gopalpur Port: అదానీ చేతికి మరో పోర్టు, 1349 కోట్లకు 95 శాతం వాటా కొనుగోలు

Gopalpur Port: దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ చేతికి మరో పోర్టు చిక్కింది. ఇప్పటికే పోర్టులపై ఆధిపత్యం కొనసాగిస్తున్న అదానీ గ్రూప్ ఒడిశాలోని కీలకమైన పోర్టును స్వాధీనం చేసుకోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 31, 2024, 09:28 PM IST
Gopalpur Port: అదానీ చేతికి మరో పోర్టు, 1349 కోట్లకు 95 శాతం వాటా కొనుగోలు

Gopalpur Port Share: దేశంలోని పోర్టుల్లో అత్యధికం సొంతం చేసుకున్న వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ మరో కీలకమైన పోర్టును చేజిక్కించుకుంటోంది. ఒడిశాలోని గోపాల్‌పూర్ పోర్టును కొనుగోలు చేయనుంది. షాపూర్ జీ పల్లోంజీ ఎస్‌పి గ్రూప్ నుంచి ఈ పోర్టును దక్కించుకుంటోంది. ఇప్పటికీ ఈ కొనుగోలుకు సంబంధించిన డీల్ పూర్తయింది. 

పోర్ట్ దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సంస్థ కీలకమైన డీల్ పూర్తి చేసుకుంది. అదానీకు చెందిన ఏపీసెజ్ సంస్థ చేతికి జీపీఎల్ పోర్టు దక్కనుంది. జీపీఎల్‌లో షాపూర్ జీ పల్లోంజీ - ఎస్‌పీ గ్రూప్, ఒడిశా స్టీన్ డోర్స్ లిమిటెడ్ -ఓఎస్ఎల్‌ల నుంచి మొత్తం 95 శాతం వాటాను అదానీ పోర్ట్స్ కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ విలువ 1349 కోట్లుగా ఉంది. గోపాల్‌పూర్ పోర్టులో షాపూర్ జీ పల్లోంజీకు 56 శాతం వాటా, ఓఎస్ఎల్ గ్రూప్‌కు 44 శాతం వాటా ఉన్నాయి. ఇప్పుడీ రెండింటి నుంచి ఎస్‌పీ వాటాను పూర్తిగానూ, ఓఎస్ఎల్ నుంచి 39 శాతం వాటాను అదానీ పోర్ట్స్ కొనుగోలు చేస్తోంది. ప్రారంభదశలో 1349 కోట్లు చెల్లించి మరో 5.5 ఏళ్ల తరువాత ఇంకో 270 కోట్లు చెల్లించేలా ఒప్పందం జరిగింది. 

ఒరిస్సాలోని గోపాల్‌పూర్ పోర్టు వార్షిక సామర్ధ్యం 20 మిలియన్ టన్నులుగా ఉంది. ఈ పోర్టు నుంచి ప్రధానంగా ఇనుప ఖనిజం, బొగ్గు, అల్యూమినియం రవాణా చేస్తోంది. 2024 ఈ ఆర్ధిక సంవత్సరంలో 11.3 మిలియన్ టన్నుల కార్గో ద్వారా 520 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా. షాపూర్ జీ పల్లోంజీ ఇటీవల సంస్థకు ఉన్న 20 వేల కోట్ల రుణభారాన్ని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఆస్థుల విక్రయం లేదా లీజుకు ఇవ్వడం చేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలోని ధరమ్ తార్ పోర్టును 710 కోట్లకు జేఎస్‌డబ్ల్యూ సంస్థకు విక్రయించింది. ఆ తరువాత ఈ సంస్థను కూడా అదానీ పోర్ట్స్ టేకోవర్ చేసింది. 

Also read: IPL 2024 SRH vs MI: సొంతగడ్డపై ముంబైతో తలపడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, బోణీ కొడుతుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News