వారానికి నాలుగు రోజులే వర్కింగ్ డేస్..The Pros and Cons of a 4 Day Working Week
Working days జీవ పరిణామ క్రమంలో జంతు ప్రవృత్తి నుంచి నాగరితకను అలవర్చుకున్న మనిషి ఆతర్వాత క్రమక్రమంగా సాంఘీక జీవనాన్ని మెరుగుపర్చుకుంటూ వచ్చాడు. ఈక్రమంలో వచ్చినవే రాజులు....రాజ్యాలు. ఇక ఆతర్వాత ఎన్నో వందల సంవత్సరాల తర్వాత కాని ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు మనిషి. ఇక వ్యక్తిగత జీవనం విషయానికి వచ్చే శ్రమదోపిడి వ్యవస్థ నుంచి ఇప్పుడిప్పుడే ఎనిమిది గంటల పని విధానానికి చేరుకుంటున్నాడు. అయితే అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో మాత్రం ఇంకా పని వేళలు లేవు. కనీస వేతనం ఇచ్చే పరిస్థితి లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితి ఇలా ఉంటే....ఇక వెనకబడి దేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం వర్కింగ్ క్లాస్ పరిస్థితి రోజు రోజుకు మెరుగు అవుతోంది. వారానికి ఐదు రోజుల పని దినాలను ఏనాడో ప్రారంభించిన యూరోపియన్ దేశాలు... ఇప్పుడు వారానికి నాలుగు రోజుల పనిదినాలపై వర్క్‌అవుట్ చేస్తోంది. ఈపాటికే కొన్ని దేశాలు ఈ పద్ధతిని అమలులోకి తీసుకొచ్చాయి. అయితే ఆయా సంస్థలు తమకు ఉన్న వెసులుబాటు ఆధారంగా వారానికి నాలుగు రోజుల పని దినాలను అమలు చేస్తున్నాయి. అయితే మొదటి సారిగా అమెరికాలో క్యాలిఫోర్నియా రాష్ట్రం వారానికి నాలుగు వర్కింగ్ డేస్‌పై చట్టం చేసే యోచనలో ఉంది. అయితే ఈ అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అన్నీ సవ్యంగా సాగితే ఈ కొత్త చట్టం అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
ఐస్‌లాండ్, బెల్జియం, వేల్స్, స్కాట్లాండ్, స్పెయిన్, స్వీడన్ దేశాలు కూడా ఇప్పుడే ఈ అంశంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ముందు అనధికారికంగా నాలుగు రోజుల పనిదినాలు కేటాయించి అవుట్ పుట్ ను పరిశీలిస్తున్నాయి. ఒకవేళ పనితీరులో ఏమాత్రం తేడా రాకుండా ఉంటే రానున్న రోజుల్లో వారానికి నాలుగు రోజులు మాత్రమే ఆఫీసులు నడపాలని భావిస్తున్నాయి. మరికొన్ని దేశాలు అయితే వర్కింగ్ అవర్స్‌ను ఉద్యోగుల సౌలభ్యానికి అనుగుణంగా ఫ్లెక్సిబుల్ చేస్తే వచ్చే ఫలితాలపై ప్రయోగాలు చేస్తున్నాయి. ‘ఫోర్ డేస్ వర్క్‌వీక్’ విధానాన్ని యూరప్ లోని అన్ని దేశాలు ఇప్పుడు సీరియస్ యోచిస్తున్నాయి.
అయితే యూరప్ లోని మిగతా దేశాల కంటే ముందే స్వీడన్ 2015 లో పూర్తి వేతనంతో నాలుగు రోజుల పని వారాన్ని పరీక్షించింది. అయితే దీనికి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో స్వీడన్ వెనక్కి తగ్గింది. ఇక ఇప్పుడు నాలుగు రోజుల పనివారంతో స్పెయిన్ ప్రయోగాలు చేస్తోంది. జీతాలు తగ్గించకుడా ఫోర్ వర్కింగ్ డేస్ కల్పిస్తోంది. నాలుగు రోజుల పని దినాలతో ఉత్పత్తి తగ్గకపోతే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని సంస్థల యాజమాన్యాలు ప్రకటిస్తున్నాయి.
also read iPhone 15 Type C: Apple కొత్త మోడల్ iPhone 15లో USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్!
also read Samsung Galaxy M13: శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. అతితక్కువ ధరకే Galaxy M13!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.