Mileage Cars: ఇంధర ధరల పెరుగుదల కారణంగా దేశంలో హైబ్రిడ్ ఇంజన్ కార్ల వినియోగం పెరుగుతోంది. మరోవైపు కారు కంపెనీలు కూడా మైలేజ్ ఎక్కువ ఇచ్చే కార్ల ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. టొయోటా, మారుతి సుజుకి కార్లు మైలేజ్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో హైబ్రిడ్ కార్లతో పాటు అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లపై కంపెనీలు ఫోకస్ పెడుతున్నాయి. టొయోటా, మారుతి సుజుకి కంపెనీలు ఇటీవలి కాలంలో తమ కార్ల మైలేజ్ సామర్ధ్యాన్ని పెంచుతున్నాయి. ఏడాది వ్యవస్ధిలో టొయోటా రెండు హైబ్రిడ్ కార్లు హై రైడర్, హైక్రాస్‌లను లాంచ్ చేసింది. అటు మారుతి కూడా ఈ రెండింటికి పోటీగా రెండు కార్లు లాంచ్ చేసింది. మారుతి గ్రాండ్ విటారా, మారుతి ఇన్విక్టో కార్లు ప్రస్తుతం మార్కెట్‌లో టొయోటా హై రైడర్, హైక్రాస్‌లకు పోటీ పడుతున్నాయి. ఇందులో హైరైడర్, గ్రాంట్ విటారా రెండూ పెట్రోల్ వెర్షన్ అయినా సరే 28 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవు. మరోవైపు హోండా సిటీ సెడాన్ కారు కూడా హైబ్రిడ్ వెర్షన్ విక్రయాలు జరుపుతోంది. హోండా సిటీ కార్లు ప్రతి యేటా మైలేజ్ పెంచుకుంటున్నాయి.


మారుతి గ్రాండ్ విటారా వర్సెస్ టొయోటా హైరైడర్


గ్రాండ్ విటారా, హైరైడర్ కార్ల డిజైన్ తప్ప మిగిలిందంతా దాదాపుగా ఒకటే. రెండింట్లోనూ 1.5 లీటర్, 3 సిలెండర్ ఎట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ హైబ్రిడ్ పవర్‌ట్రేన్ ఆప్షన్ ఉంది. ఈ హైబ్రిడ్ సెటప్ 115 బీహెచ్‌పి పవర్ ఇస్తుంది. ఇందులో ఇ సీవీటీ గేర్ బాక్స్ ఉంది. రెండు ఎస్‌యూవీలు పెట్రోల్‌పై ఏకంగా 27.97 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఆఫర్ చేస్తున్నాయి. రెండింట్లోనూ ఆల్ వీల్ డ్రైవ్ ఉంది. 


హోండా సిటీ హైబ్రిడ్


ఇందులో 1.5 లీటర్ హైబ్రిడ్ ఎట్కిన్సన్ సైకిల్ ఇంజన్ అమర్చారు. హోండా సిటీ హైబ్రిడ్ వెర్షన్ లీటర్‌కు 26.5 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇవ్వవచ్చు. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయిస్తే 1000 కిలోమీటర్లు హాయిగా ప్రయాణం చేయవచ్చు. నాన్ హైబ్రిడ్ వెర్షన్ కూడా లబిస్తోంది. 


టొయోటా ఇన్నోవా హైక్రాస్ వర్సెస్ మారుతి ఇన్విక్టో


ఈ రెండూ ఒకే పవర్ ట్రేన్‌తో వస్తున్నాయి. మారుతి ఇన్విక్టో పూర్తిగా టొయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారితమైంది. ఇది మోనోకాక్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మితమైంది. ఈ రెండు కార్ల హైబ్రిడ్ వెర్షన్‌లో 2.0 లీటర్, 4 సిలెండర్ ఎట్కిన్సన్ సైకిల్ ఇంజన్ మరో ప్రత్యేకత. ఇందులో ఇ సీవీటీ ఉంటుంది. ఈ రెండు కార్లు 23.24 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తాయి.


Also read: Hyundai Cars: హ్యుండయ్ కార్లపై భారీగా దసరా ఆఫర్లు, ఏకంగా 50 వేల వరకూ డిస్కౌంట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook