దేశ వ్యాప్తంగా ఇటీవలే ఒక్కొక్కటిగా ప్రారంభమౌతున్న వందభారత్ రైళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా దేశంలో మరో 400 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కోసం రైల్వే అధికారులు టెండర్లు జారీ చేశారు. అయితే వీటిని పూర్తిగా ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా..బిడ్స్ ఆహ్వానించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ప్రస్తుతం 10 వందేభారత్ రైళ్లు తిరుగుతున్నాయి. వందేభారత్ రైళ్లకు లభిస్తున్న ఆదరణ, పెరుగుతున్న ఆక్సుపెన్సీ రేటు, డిమాండ్ దృష్టిలో ఉంచుకుని దేశంలో కొత్తగా 400 వందేభారత్ రైళ్ల తయారీకు ప్రభుత్వం సిద్ధమైంది. కోచ్‌ల తయారీ, నిర్వహణను ప్రైవేట్‌పరం చేసేందుకు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగా బిడ్స్ ఆహ్వానించింది. దేశీయ, విదేశీ కంపెనీలు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ జారీ చేశాయి. ఇందులో 200 రైళ్లు స్లీపర్ క్లాస్ అయితే మరో 200 రైళ్లు ఛైర్ కారు సర్వీసులు. స్లీపర్ క్లాస్ రైళ్ల గరిష్ట వేగాన్ని 200 నుంచి 220 వేగంతో తీర్చిదిద్దే అవకాశాలున్నాయి.


ప్రస్తుతం వందేభారత్ రైళ్ల కోచ్‌లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి. ఇప్పుడీ బాధ్యతల్నించి ఐసీఎఫ్‌ను తొలగించనుంది కేంద్రం. కొత్త కోచ్‌ల తయారీ, నిర్వహణను ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లను కూడా ఆహ్వానించింది. దీనికోసం ఫ్రాన్స్‌కు చెందిన అల్ స్టోమ్ కన్సార్టియం, భారత్-స్విట్జర్లాండ్ సంస్థ మేధా-స్టాడ్లర్ రైల్ కన్సార్టియం బిడ్స్ దాఖలు చేశాయి. 35 ఏళ్ల పాటు వందేభారత్ రైళ్లకు అవసరమైన అల్యూమినియం కోచ్‌లను ఈ కన్సార్టియం తయారు చేస్తుంది. ఈ కాంట్రాక్ట్ విలువ 30 వేల కోట్లు. బిడ్స్ దాఖలు చేసేందుకు 45 రోజులు గడువుంది.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లకు డిమాండ్ ఉంది. ఫలితంగా వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంటోంది. టికెట్ రేటు ఎక్కువైనా..సమయం, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆక్సుపెన్సీ రేటు ఎక్కువగా ఉంది. సుదూర ప్రయాణాలకు వందేభారత్ రైళ్లు బెటర్ అనే అభిప్రాయంలో ప్రజలున్నారు. అందుకే మరిన్ని వందేభారత్ రైళ్లు వివిధ రూట్లలో కోరుకుంటున్నారు. 


Also read: Tata Nexon Features: టాటా మోటార్స్ నుంచి రెడ్ డార్క్ ఎడిషన్ మోడల్స్ లాంచ్, హ్యుండయ్ క్రెటా కంటే ఎక్కువే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook