Tata Nexon Features: టాటా మోటార్స్ నుంచి రెడ్ డార్క్ ఎడిషన్ మోడల్స్ లాంచ్, హ్యుండయ్ క్రెటా కంటే ఎక్కువే

Tata Nexon Features: అద్భుతమైన ఫీచర్లు, టాప్ క్లాస్ లుక్స్‌తో టాటా మోడల్ కార్లు క్రేజ్ సంపాదించుకున్నాయి. టాటా మోటార్స్ నెక్సాన్, హారియర్, సఫారీ మోడల్స్‌కు చెందిన రెడ్ డార్క్ ఎడిషన్ వెర్షన్ లాంచ్ చేసింది. హ్యుండయ్ క్రెటా కంటే ధర ఎక్కువే. ఇతర ఫీచర్లు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 24, 2023, 05:13 PM IST
Tata Nexon Features: టాటా మోటార్స్ నుంచి రెడ్ డార్క్ ఎడిషన్ మోడల్స్ లాంచ్, హ్యుండయ్ క్రెటా కంటే ఎక్కువే

టాటా మోటార్స్ కార్లకు మార్కెట్‌లో క్రేజ్ ఉంది. డిమాండ్ ఉంది. ఇటీవల లాంచ్ చేసిన నెక్సాన్, హ్యారియర్, సఫారీల రెడ్ డార్క్ ఎడిషన్ వెర్షన్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్ 12.35 లక్షల రూపాయల ఎక్స్ షోరూం ధరకు అందుబాటులో ఉంది. అంటే హ్యుండయ్ క్రెటాతో పోలిస్తే ధర చాలా ఎక్కువ. హ్యుండయ్ క్రెటా ధర 10.84 లక్షలే. ధర ఎక్కువైనా ఫీచర్లు చాలా ఎక్కువ. ఆ ఫీచర్ల గురించి తెలుసుకుందాం..

టాటా నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్ డిజైన్, ఇంటీరియర్

నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నవేరియంట్‌తో ప్రత్యేకంగా ఉండేందుకు ఫ్రంట్ గ్రిల్, బ్రేక్ క్లీపర్స్‌పై రెడ్ యాక్సెంట్ కలపడమైంది. దాంతోపాటు ఎస్‌యూవీ ఓబెరాన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ ఉంది. ఫ్రంట్ ఫేండర్‌పై రెడ్ కలర్ డార్క్ బ్యాజ్ ఉంది. ఇంకొన్ని ఫీచర్లను డార్క్ వెర్షన్ నుంచి తీసుకున్నారు. బ్లాక్ అవుట్ 16 ఇంచెస్ ఎల్లాయ్ వీల్స్ ప్రత్యేకత. వీటిపై చార్‌కోల్ బ్లాక్ పెంట్ స్కీమ్ ఉంది. 

కేబిన్‌లో డైమండ్ స్టైల్ క్విల్టింగ్ లెదరెట్ సీట్లతో పాటు రెడ్ థీమ్ ఉంది. ఎస్‌యూవీలో టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫయర్ కూడా ఉన్నాయి. ఇందులో డోర్ గ్రాబ్ హ్యాండిల్, సెంటర్ కన్సోల్, స్టీరింగ్ వీల్ థీమ్ ప్రకారం రెడ్ కలర్ యాక్సెంట్‌తో ఉన్నాయి.

టాటా నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్ ఇంజన్

Nexon Red Dark Edition పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారు 1.2 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 118 బీహెచ్‌పి పవర్, 170 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. అటు 1.5 లీర్ పవర్ ట్రేన్ 108 బీహెచ్‌పి, 260 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6 స్పీడ్ మాన్యువల్ , ఏఎంటీ గేర్ బాక్స్ ఉంది. ఇక సేఫ్టీ విషయంలో టాటా నెక్సాన్ పవర్ స్టార్ గ్లోబల్ ఎన్‌సీఏపీ రేటెడ్ కారు. ఇందులో ఎయిర్ బ్యాగ్, సీట్ బెల్ట్ వార్నింగ్, ఓవర్ స్పీడ్ వార్నింగ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, యాంటీ థెఫ్ట్ ఇంజన్ వంటి ప్రత్యేకతలున్నాయి.

Also read: Jio Mobile New Plans: జియో నుంచి 11 నెలల అద్భుతమైన ప్లాన్, ఇతర చౌక ప్లాన్స్ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News