Vivo Holi Offer: ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ వివో హోలీ పండగ సందర్భంగా వీ 23 సిరీస్ మొబైల్ ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ మార్చి 11 నుంచి మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. వివో ఇండియా ఈ-స్టోర్‌తో పాటు పార్ట్‌నర్ రిటైల్ స్టోర్స్‌ ద్వారా కొనుగోలు చేసే మొబైల్ ఫోన్లపై ఈ క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివో వీ 23 హోలీ ఆఫర్ : 


వివో వీ23, వివో వీ23 ప్రో, వివో వీ23e 5జీ మొబైల్ ఫోన్లపై వివో కంపెనీ రూ.3500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంకుల కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు వన్ టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను కూడా అందిస్తోంది.


వీవో వీ23, వీ23 ప్రో, వివో వీ23e ధరలు :


8GB + 128GB స్టోరేజ్‌ వేరియంట్‌తో కూడిన వివో వీ23 5జీ  ధర రూ. 29,990. 12GB + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 34,990గా ఉంది.


వివో వీ23 ప్రో 5జీ 8GB + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 38,990. 12GB + 256GB స్టోరేజ్ ఉన్న హై-ఎండ్ మోడల్ ధర రూ. 43,990. Vivo V23 5G స్టార్‌డస్ట్ బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంది. Vivo V23 Pro 5G సన్‌షైన్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.


వివో వీ23e 5G 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. దీని ధర ఇండియాలో రూ. 25,990. ఇది సన్‌షైన్ గోల్డ్, మిడ్‌నైట్ బ్లూ కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.


వివో వీ23 ప్రో, వీ23 50 మెగా పిక్సెల్‌తో కూడిన అడ్వాన్స్డ్ ఐ ఆటో ఫోకస్ టెక్నాలజీతో, 108 మెగాపిక్సెల్ అల్ట్రా క్లారిటీ బ్యాక్ కెమెరాతో లభిస్తోంది. వీ23e 5జీ మొబైల్ ఫోన్ 44 మెగాపిక్సెల్ ఐ ఆటో ఫోకస్ ఫ్రంట్ కెమెరాతో లభిస్తోంది. 


Also Read: Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​లో అవకతవకలు.. ఆర్​బీఐ తాత్కాలిక నిషేధం!


Flipkart Big Saving Days: ఫ్లిప్​కార్ట్ బిగ్​ సేవింగ్ డేస్ సేల్​ షురూ.. డీల్స్ ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook