Budget 2022 Expectations: బడ్జెట్ 2022లో ఆ నిర్ణయం ఉంటే.. పెరగనున్న టెక్ హోం శాలరీ!
Budget 2022 Expectations: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ నుంచి వేతన జీవులు ఏం కోరుకుంటున్నారు?
Budget 2022 Expectations: 2022-23కు సంబంధించి ఈ మంగళవారమే బడ్జెట్ ప్రవేశపెట్టనంది కేంద్రం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే ఈ సారి కూడా బడ్జెట్‌పై పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తిగా పేపర్‌లెస్‌గా ఈ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం.
అయితే బడ్జెట్ 2022పై వేతన జీవులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచే అవకాశముందని ఆశిస్తున్నారు.
పద్దుపై వేతన జీవుల ఆశలు ఇలా..
బడ్జెట్ 2022లో వర్క్ ఫ్రం హోం చేస్తున్న వారికి పన్ను రహిత అలవెన్సులు ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది. పన్ను పరిమితిని పెంచడం ద్వారా ఉద్యోగులకు టెక్ హోం శాలరీ పెరిగే అవకాశముంది.
అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది కూడా డిడక్షన్ పరిమితిని పెంచేందుకు దోహదం చేయొచ్చని ఆర్థిక సేవలు అందించే 'విలియమ్ ఓ నెయిల్' అనే సంస్థ అంచనా వేసింది.
కొత్త పన్ను విధానంతో లభించని ఊరట..
నిజానికి బడ్జెట్ 2021లో ఆర్థిక మంత్రి సరికొత్త పన్ను విధానాన్ని అమలు చేశారు. అయితే దీని వల్ల వేతన జీవులకు పెద్దగా ఊరట లభించలేదు. కొత్త విధానాన్ని తెచ్చినప్పటికీ.. పాత విధానాన్ని కూడా ప్రభుత్వంత అమలు చేస్తోంది. ఏ విధానం కావాలో ఎంచుకునే వెసులుబాటు మాత్రం పన్ను చెల్లింపుదారుల ఇష్టమేనని స్పష్టత ఇచ్చింది. దీనితో చాలా మంది పాత పన్ను విధానాన్ని అనుసరిస్తున్నారు. కొత్త విధానంలో పన్ను రాయితీలు అంతగా లేకపోవడమే ఇందుకు కారణం.
వినియోగం పెరిగేలా..
దీనితో ఈ సారి పన్ను రహిత ఆదాయపు శ్లాబ్‌ను రూ.2.5 లక్షల నుంచి పెంచే అవకాశముందని అంచనాలు వస్తున్నాయి. వ్యక్తిగాత ఆదాయపు పన్ను పరిమితిని పెంచితే.. చాలా మంది కోనుగోళ్ల వైపు మొగ్గు చూపుతారని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఫలితంగా వ్యవస్థలో వినియోగం పెరుగుతుందని భావిస్తున్నారు. దీనివల్ల GST లాంటి పరోక్ష పన్నుల వసూళ్ల వాటా కూడా పెరుగుతుందని అంచనాలు వస్తున్నాయి.
సెక్షన్ 80 సీ పరిమితి పెంపు?
బీమా, పీపీఎఫ్ సహా పలు ప్రభుత్వం పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద.. పన్ను మినహాయింపు ఇస్తుంది ప్రభుత్వం.
ఈ పథకాల ద్వారా ప్రస్తుతం గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. అయితే ఈసారి బడ్జెట్లో సెక్షన్ 80 సీ కింద ఇచ్చే పన్ను మినహాయింపును రూ.2-2.5 లక్షలకు పెంచే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ పరిధిని రూ.3 లక్షలకు పెంచాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం నిర్ణయాలు ఎలా ఉన్నాయో తెలియాలంటే.. ఫిబ్రవరి 1వరకు ఆగాల్సిందే.
Also read: WhatsApp Dangerous Scams: వాట్సప్ మోసాలు.. ఇలాంటి మెసేజ్ లు వస్తే వెంటనే జాగ్రత్త పడండి!
Also read: Moto G60 for RS 149: కేవలం రూ.149లకే Moto G60 స్మార్ట్ ఫోన్.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook