WhatsApp Companion Mode: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలోనే సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా ఒకే వాట్సాప్ ఖాతాను ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ మొబైల్ డివైజ్‌లలో కనెక్ట్ చేయవచ్చు. ఇందుకోసం కంపానియన్ మోడ్ అనే ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కంపానియన్ మోడ్ అంటే ఏమిటి :


ప్రస్తుతం వాట్సాప్‌లో 'లింక్డ్ డివైజెస్' ఆప్షన్ ద్వారా డెస్క్ టాప్‌కి దాన్ని కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇదే వెసులుబాటు త్వరలో మొబైల్ డివైజ్‌లో కూడా అందుబాటులోకి రానుంది. అంటే ప్రైమరీ మొబైల్ డివైజ్ లింక్ ద్వారా వేరే స్మార్ట్ ఫోన్లలోనూ మీ వాట్సాప్ అకౌంట్‌ను యూజ్ చేయవచ్చు. అయితే అలా ఇతర డివైజ్‌లో వాట్సాప్ యూజ్ చేసే సమయంలో ప్రైమరీ డివైజ్‌లోని వాట్సాప్ అకౌంట్ ఆటోమేటిగ్గా లాగౌట్ అవుతుంది. ప్రైమరీ డివైజ్‌లోని డేటా కూడా తొలగించబడుతుంది. అయితే గూగుల్ డ్రైవ్ ద్వారా బ్యాకప్ డేటాను పొందవచ్చు.


ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఇప్పటికైతే క్లారిటీ లేదు. ప్రస్తుతం వాట్సాప్ ఈ ఫీచర్‌ను అభివృద్ది చేస్తున్నట్లు తెలుస్తోంది.త్వరలో క్విక్ స్టేటస్ రిప్లైస్ అనే ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ ఆప్షన్ ద్వారా వాట్సాప్ స్టేటస్‌పై యూజర్స్ క్విక్ రియాక్షన్స్ పంపించవచ్చు. 


Also Read: Srilanka Crisis:శ్రీలంక మళ్లీ రణరంగం.. అధ్యక్షుడు  గొటబయ రాజపక్స పరార్..


Also Read: Rashmika Mandanna: లక్కు తోక తొక్కిన రష్మిక.. మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ లో ఛాన్స్.!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.