Srilanka Crisis:శ్రీలంక మళ్లీ రణరంగం.. అధ్యక్షుడు గొటబయ రాజపక్స పరార్..

Srilanka Crisis:శ్రీలంక మళ్లీ రణరంగమైంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో నెల క్రితం వరకు తీవ్ర ఆందోళనలు జరిగాయి. నిరసనలు హోరెత్తడంతో ప్రధానమంత్రి పదవికి మహేంద్ర రాజపక్స రాజీనామా చేశారు. ఆయన స్థానంలో విక్రమ్ సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నిరసనలు తగ్గాయి. అయితే తాజాగా మళ్లీ శ్రీలంకలో నిరసనలు హోరెత్తాయి. 

Written by - Srisailam | Last Updated : Jul 9, 2022, 02:51 PM IST
  • శ్రీలంకలో మళ్లీ హోరెత్తిన నిరసనలు
  • అధ్యక్ష భవనం ముట్టడి
  • అధ్యక్షుడు గొటబయ రాజపక్స పరార్
Srilanka Crisis:శ్రీలంక మళ్లీ రణరంగం.. అధ్యక్షుడు  గొటబయ రాజపక్స పరార్..

Srilanka Crisis:శ్రీలంక మళ్లీ రణరంగమైంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో నెల క్రితం వరకు తీవ్ర ఆందోళనలు జరిగాయి. నిరసనలు హోరెత్తడంతో ప్రధానమంత్రి పదవికి మహేంద్ర రాజపక్స రాజీనామా చేశారు. ఆయన స్థానంలో విక్రమ్ సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నిరసనలు తగ్గాయి. అయితే తాజాగా మళ్లీ శ్రీలంకలో నిరసనలు హోరెత్తాయి. అధ్యక్షుడు  గొటబయ రాజపక్స అధ్యక్ష పదవీకి రాజీనామా చేయాలంటూ నిరసనకారులు రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.  కొలంబోలోని అధ్యక్షుడిఅధికారిక నివాసం ముందు వేలాది మంది ఆందోళనకు దిగారు. ప్రెసిడెంట్ భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.

నిరసనకారులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో భయంతో గొటబయ రాజపక్స అధికారిక నివాసం వదిలి పారిపోయారు. అయితే ఆర్మీ వర్గాలు మాత్రం రాజపక్స పారిపోలేదని.. నిరసనకారులు లోపలికి వచ్చే ప్రయత్నం చేయడంతో ముందు జాగ్రత్తగా తామే ఆర్మీ హెడ్‌క్వాటర్స్‌కు తరలించామని తెలిపాయి. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని ఇంటెలిజెన్సీ వర్గాలు హెచ్చరించడంతో శుక్రవారం రాత్రే రాజపక్సను అధ్యక్ష భవనం నుంచి ఆర్మీ కార్యాలయానికి తరలించినట్టు శ్రీలంక రక్షణ శాఖ వెల్లడించింది.భద్రత దృష్ట్యా అధ్యక్షుడు గొటబయకు ఎస్కార్ట్ కల్పించామని తెలిపింది. ఇక శ్రీలంక అధ్యక్ష భవనాన్ని చుట్టుముడుతున్న ఆందోళనకారుల సంఖ్య పెరుగుతుండడంతో  భద్రతా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. 

Read also: Amarnath Yatra :అడుగడుగులో అపాయం.. అయినా బెదరని భక్తజనం! అమర్ నాథ్ యాత్ర ఎందుకంత ప్రత్యేకం? 

Read also: Vikram Movie Making Video: విక్రమ్ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్.. ప్రాణం పెట్టి మరీ! 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News