Whatsapp New Feature: వాట్సప్‌లో త్వరలో సరికొత్త ఫీచర్, తెలిస్తే ఆశ్చర్యపోతారు
Whatsapp New Feature: వాట్సప్ ఇప్పుడు మరో కొత్త ఆప్‌డేట్ తీసుకొస్తోంది. కొద్దిరోజుల క్రితం లాంచ్ చేసిన మెస్సేజ్ రియాక్షన్ ఫీచర్‌కు అప్‌డేట్ ఇది. ఆ అప్‌డేట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Whatsapp New Feature: వాట్సప్ ఇప్పుడు మరో కొత్త ఆప్‌డేట్ తీసుకొస్తోంది. కొద్దిరోజుల క్రితం లాంచ్ చేసిన మెస్సేజ్ రియాక్షన్ ఫీచర్‌కు అప్‌డేట్ ఇది. ఆ అప్‌డేట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు, అప్‌డేట్స్‌తో యూజర్లను ఆకర్షిస్తుంటోంది. కొద్దికాలం క్రితం వాట్సప్ మెస్సేజ్ రియాక్షన్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు మెటా ఆ ఫీచర్‌ను మరింత అభివృద్ధి చేస్తోంది. ఇప్పటివరకూ ఏదైనా గ్రూప్ సభ్యుడు ఆటోమేటిక్ ఆల్బమ్‌లో ఏదైనా ఇమేజ్ పై రియాక్షన్ షేర్ చేస్తే..ఆల్బమ్ ఓపెన్ చేయకుండా దేనిపై రియాక్షన్ వచ్చిందనేది తెలుసుకునేందుకు వీలుండేది కాదు. వాట్సప్ గ్రూప్‌లో ఏ సభ్యుడు ఏ రియాక్షన్ ఇచ్చాడనేది తెలుసుకోవచ్చు. అంటే యూజర్ల స్పందన తెలుసుకోవాలంటే ఆ ఆల్బమ్ ఓపెన్ చేయకతప్పదు.
వాట్సప్ కొత్త అప్‌డేట్
ఇప్పుడు మెస్సేజింగ్ యాప్ మరింతగా అభివృద్ధి చేస్తోంది. గ్రూపులో ఏ సభ్యుడు ఏం రియాక్షన్ ఇచ్చాడనేది ఒక్కొక్కటి చూడకుండానే రియాక్షన్ తెలుసుకునేలా ఈ ఫీచర్‌ను మెటా ఇప్పుడు అభివృద్ధి చేస్తోంది. ఆటోమేటిక్ ఆల్బన్ ఓపెన్ చేయకుండా రియాక్షన్ తెలుసుకునే పరిస్థితి ఇంకెక్కడుందో తెలియదు కానీ..వాట్సప్ భవిష్యత్తులో మీడియా థంబ్ నెయిల్ చూపించి సమగ్ర సమచారాన్ని చూసే వీలు కల్పిస్తుందని WABetaInfo తన నివేదికలో తెలిపింది.
ఈ స్క్రీన్‌షాట్ ఐవోఎస్ ఇంటర్‌ఫేస్ కోసం వాట్సప్ ఒక ఇమేజ్ చూపిస్తుంది. అటు ఆండ్రాయిడ్ కోసం వాట్సప్ , డెస్క్‌టాప్ వాట్సప్ కోసం ఈ విధమైన మార్పులకు ప్రయత్నిస్తోంది మెటా. ప్రస్తుతం ఈ అప్‌డేట్ అభివృద్ధి దశలో ఉందని..ఎప్పుడు అందుబాటులో వస్తుందనే విషయంపై స్పష్టత లేదని తెలుస్తోంది.
Also read: Edible Oils: కస్టమ్స్, అగ్రిసెస్ మినహాయింపు, భారీగా దిగుమతి, తగ్గనున్న వంటనూనె ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook