LIC Policy: కేవలం రూ.70 పెట్టుబడితో రూ.48 లక్షల ఆదాయం.. ఇలా చేయండి
LIC New Premium Endowment Policy: మీరు భవిష్యత్ కోసం మంచి పొదుపు పథకం కోసం చూస్తున్నారా..? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం మంచి పథకం ఉంది. వివరాలు ఇలా..
LIC New Premium Endowment Policy: పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో రూపాయి సంపాదిస్తే ముప్పావు వంతు ఖర్చులకే పోతుంది. ఇక మిగిలిన పావు వంతు భవిష్యత్ కోసం దాచిపెట్టాల్సిందే. అయితే మిగిలిన డబ్బులు ఎక్కడ దాచిపెట్టాలనేది చాలామందికి తెలియక కాస్త అయోమయానికి గురవుతుంటారు. ఇలాంటి ఇబ్బంది లేకుండా.. భవిష్యత్‌పై భరోసా ఇస్తూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ఓ మంచి స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఇందులో మీరు రోజువారీ రూ.70 పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో రూ.48 లక్షలు పొందవచ్చు.
ఎల్‌ఐసీ ఈ ప్లాన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది
ప్రభుత్వం తరపున ఎల్‌ఐసీ ఈ పథకాన్ని ప్రారంభించింది. కొత్త ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఎల్ఐసీ ఈ ప్లాన్‌లో చిన్న పెట్టుబడితో అధిక రాబడిని పొందవచ్చు. ఈ ప్లాన్‌ను తీసుకోవడం ద్వారా మీరు మీ పిల్లల చదువులు, రుణాల చెల్లింపు, భవిష్యత్తు అవసరాలను తీర్చుకోవచ్చు. దీంతో పాటు బీమా రక్షణ, ఇతర పన్ను సంబంధిత ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..?
8 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల వారు ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పాలసీ వ్యవధి 12 నుంచి 35 సంవత్సరాలు ఉంటుంది. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వ్యక్తి ఈ ప్లాన్‌ను తీసుకుంటే.. అతను రోజుకు సుమారు రూ.70 అంటే సంవత్సరానికి రూ.26,534 పెట్టుబడి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా అతనికి రూ.10 లక్షల బీమా హామీ లభిస్తుంది. రెండో సంవత్సరంలో ఈ ప్రీమియం రూ.25,962కి తగ్గుతుంది. ఈ విధంగా మెచ్యూరిటీపై మీరు రూ.48 లక్షలు పొందవచ్చు.
ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు..
ఈ ప్లాన్‌ను మీరు తీసుకోవాలనుకుంటే.. సమీపంలోని ఏదైనా ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లి అక్కడ కొనుగోలు చేయవచ్చు. మీకు కావాలంటే.. మీరు ఇందులో ఎంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఎల్ఐసీ కార్యాలయంలో ఈ స్కీమ్‌కు సబంధించి మరింత వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు. అన్ని వివరాలు తెలుసుకున్న తరువాతే ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.
Also Read: SBI Interest Rate Hike: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. నేటి నుంచే అమలు
Also Read: Gujarat Politics: బీజేపీలోకి ఐదుగురు ఎమ్మెల్యేలు.. ఊహాగానాలకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook