Gujarat AAP MLAs Meet with Arvind Kejriwal: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సత్తా చాటుతుందనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఐదు సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతున్నారంటూ గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ పెద్దలతో చర్చలు పూర్తయ్యాయని.. త్వరలో కషాయ తీర్థం పుచ్చుకున్నారంటూ స్థానిక మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే అవన్నీ పుకార్లేనని తేలిపోయింది.
కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను బుధవారం న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో పార్టీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు 'ఆప్' గుజరాత్ యూనిట్ ఆఫీస్ బేరర్లందరూ కూడా హాజరయ్యారు. గుజరాత్ ఎన్నికల్లో పార్టీ పనితీరు, తదుపరి వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 182 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ బీజేపీ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఆప్ కేవలం 5 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. వీటిలో జామ్ జోధ్‌పూర్, విసవదర్, గరియాధర్, దేడియాపద, బోటాడ్ స్థానాలు ఉన్నాయి. ఇంతలో పార్టీకి సంబంధించి ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరవచ్చనే ప్రచారం జరిగింది.
బొటాడ్ నుంచి ఉమేష్ మక్వానా, దేడియాపాడ నుంచి చైతర్ వాసవ, సురేంద్ర నగర్ జిల్లాలోని గరియాధర్ స్థానం నుంచి సుధీర్ వఘాని, సామాజిక కార్యకర్త భూపత్ భాయ్ భయాని, జామ్‌నగర్ జిల్లాలోని జామ్ జోధ్‌పూర్ స్థానం నుంచి హేమంత్ భువా గెలుపొందారు. ఈ ఎమ్మెల్యేలంతా తాజాగా అరవింద్ కేజ్రీవాల్‌ను కలవడంతో బీజేపీలో చేరతారే ప్రచారానికి తెరపడింది.
గుజరాత్ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీకి అనేక విధాలుగా ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు. ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలవలేకపోయినా.. ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతంతో జాతీయ పార్టీ హోదా వచ్చేసింది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 40 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇది మొత్తం ఓట్లలో దాదాపు 13 శాతం. వచ్చే ఎన్నికలకు ఆ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది.
Also Read: 7th Pay Commission: ఉద్యోగులకు బంపర్ బహుమతి.. 18 నెలల డీఏ పెండింగ్ కేంద్ర నిర్ణయం..?
Also Read: High Tech Cheating: పోలీసుల్లో చేరేందుకు ఎం సీల్ సాయం.. పాపం ఇలా దొరికేసిందిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook