Zomato Update: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కంపెనీ వ్యవస్థాపకుడైన గౌరవ్ గుప్తా బయటికొచ్చేసినట్టు సమాచారం. కారణాలు తెలియదు గానీ..గుప్తా అవుట్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో(Zomato) అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జొమాటో కంపెనీ వ్యవస్థాపకుడు, జొమాటో కీలక వ్యవహారాలు చూసుకునే గౌరవ్ గుప్తా కంపెనీ వీడినట్టు తెలుస్తోంది. జాతీయ మీడియాలో ఇదే విషయంపై కథనాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో జొమాటో షేర్లు స్వల్పంగా పతనం కావడం గమనార్హం.


జొమాటో సంస్థలో  కీలక నిర్ణయాల్నించి మొదలుకుని ఐపీవోకు వెళ్లడం, ఇన్వెస్టర్లతో చర్చలు, మీడియాతో ఇంటెరాక్షన్ వంటి వ్యవహారాలన్నీ గౌరవ్ గుప్తానే చూసుకుంటూ వచ్చారు. జొమాటో ఐపీవోకు(Zomato IPO) వెళ్లిన 2 నెలల తరువాత నిత్యావసర సరుకుల డెలివరీ, న్యూట్రాస్యూటికల్ వ్యాపారాన్ని నిలిపివేసింది. ఈ తరుణంలో గౌరవ్ గుప్తా బయటకు వచ్చేయడం చర్చనీయాంశమైంది. అసలు గౌరవ్ గుప్తా జొమాటో నుంచి ఎందుకు బయటికొచ్చారనేది కచ్చితంగా ఇంకా తెలియలేదు. ఇవాళ జొమాటోలో ఆయనకు చివరి వర్కింగ్ డేగా తెలుస్తోంది. ఆరేళ్ల జొమాటో తన ప్రయాణం ముగిసిందని..కొత్త జర్నీ ప్రారంభించబోతున్నట్టుగా అంతర్గతంగా ఉద్యోగులకు మెయిల్ చేసినట్టుగా ఓ ప్రకటన వైరల్ అవుతోంది. వాస్తవానికి నిత్యావసర వస్తువుల డెలివరీ, న్యూట్రాస్యూటికల్ వ్యాపారాలు గౌరవ్ ఐడియాలే. అటు ఓవర్సీస్‌లో జొమాటో విస్తరణ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. 2015లో జొమాటోలో చేరిన గౌరవ్ గుప్తా 2018 నుంచి ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. 2019లో జొమాటోలో ఫౌండర్ హోదా దక్కింది. 


lso read: Elon Musk Effect: ఎలాన్ మస్క్ ఎఫెక్ట్ మామూలుగా లేదుగా, క్రిప్టోకరెన్సీ ఒక్కసారిగా ఎలా పెరిగిందో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook