Noida Youtuber Death News: గ్రేటర్ నోయిడాలో ఓ యూట్యూబర్ హత్య ఘటన కలకలం రేపుతోంది. ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకోగా.. మద్యం మత్తులో అతని స్నేహితులే హత్య చేశారు. యూట్యూబర్ తలపై కర్రలతో దాడి చేసి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులపై పోలీసులు కేసు‌ నమోదు చేశారు. ఘటన జరిగినప్పుడు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఘటన గ్రేటర్ నోయిడాలోని దంకౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీపక్ గుర్జార్‌ అనే యువకుడు గత ఐదేళ్లుగా యూట్యూబ్‌లో వీడియోలను చేసుకుంటున్నారు. అతనికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో లక్ష మందికి పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. మరో వ్లాగర్ మనీష్ తన కుటుంబంతో కలిసి హాస్యభరితమైన వీడియోలు, వ్లాగ్‌లను రూపొందిస్తున్నాడు. తన తన యూట్యూబ్ ఛానెల్‌ను రూ.60 వేలకు విక్రయించేందుకు దీపక్‌తో బేరం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి ఫ్రెండ్స్ అందరూ కలిసి మహ్మద్‌పూర్ గుర్జర్ గ్రామంలోని మనీష్ ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.


ఫుల్‌గా మద్యం సేవించగా.. మద్యం మత్తులో ఏదో విషయమై వివాదం చెలరేగింది. మాటమాట పెరిగి అది భౌతిక దాడుల వరకు వెళ్లింది. అందరూ ఒక్కసారిగా దీపక్ గుర్జార్‌పై కర్రలతో దాడి చేశారు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేర్పించగా.. సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.


 




మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్ట్‌మార్టంలో మద్యంతోపాటు డ్రగ్స్ కూడా సేవించినట్లు వెల్లడైంది. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మనీష్, ప్రిన్స్, విక్కీ, యోగేంద్ర, విజయ్, కపిల్, మింకు అనే ఏడుగురు స్నేహితులపై హత్య కేసు నమోదు చేసినట్లు గ్రేటర్ నోయిడా ఏడీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 


Also read: CAA in India: సీఏఏపై మళ్లీ వివాదం, వారం రోజుల్లో అమలు చేస్తామని కేంద్ర మంత్రి వ్యాఖ్యలు


Also Read: Sharmila Meets Sunitha: షర్మిల మరో సంచలనం.. వివేకా కూతురు సునీతతో భేటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి