Hyderabad Crime Rate: కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. మహానగరంలో నిత్యం ఎక్కడో ఒకచోట హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు వంటి ఘటనలతో హైదరాబాద్‌ రక్తసిక్తమవుతోంది. 24 గంటల్లోనే 5 హత్యలు చోటుచేసుకోవడం భాగ్యనగరంలో కలకలం రేపింది. హత్యలతో హైదరాబాద్‌ నిద్రలేచింది. ఈ సంఘటనతో నగరవాసులు భయాందోళనతో బయటకు వెళ్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sexual Assault: పోర్న్‌ చూస్తూ సొంత బిడ్డపై తండ్రి లైంగిక దాడి.. నాన్న అనే పేరుకే కళంకం వీడు


 


హైదరాబాద్‌లో గడిచిన 24 గంటల్లో 5 హత్యలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా రెండు హత్యాయత్నం సంఘటనలు జరిగాయి. బుధవారం అర్ధరాత్రి హబీబ్‌నగర్‌ రౌడీషీటర్‌ అలీమ్‌ను ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మల్లేపల్లి క్రాస్‌‌ రోడ్డు వద్ద అమృత్‌ వైన్స్‌ పక్కన గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆసిఫ్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే సంఘటనా స్థలంలో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. తాగి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని తెలుస్తోంది. కాగా ఇక్కడే మంగళవారం రేవంత్‌ రెడ్డి ఐటీఐకి సంబంధించిన ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Also Read: Chennai: యువకుడి ప్రాణం తీసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ కుమార్తె.. కారుతో చెన్నైలో హల్‌చల్‌


 


కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రషీద్ బిన్ సిమ్లాలన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హజహర్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఇక సికింద్రాబాద్ తుకారాం గేట్‌లో కట్టుకున్న భార్యను భర్త కడతేర్చాడు. ఇక రెండు చోట్ల హత్యాయత్నాలు జరిగాయి. షాలిబండాపోలీస్ స్టేషన్ పరిధిలో వాజిద్ అనే వ్యక్తిపై, ఫక్రుద్దీన్ అనే వ్యక్తిపై వేర్వేరుగా హత్యకు యత్నించారు. తృటిలో దాడి నుంచి తప్పించుకున్న వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


కాచిగూడలో
నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో కైజర్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వారు హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న కాచిగూడ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తన కుమారుడిది ముమ్మాటికీ హత్యేనని మృతుడి తండ్రి తెలిపాడు. హత్య చేసి  ప్రమాదంగా కొందరు  చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని బాధితుడి తండ్రి పోలీసులను వేడుకున్నాడు


నిద్రపోతున్న పోలీస్ వ్యవస్థ
వరుస హత్యలు, హత్య యత్నాలు, దాడులతో హైదరాబాద్‌ బెంబేలెత్తుతోంది. రోజురోజుకు అసాంఘిక కార్యకలాపాలు.. రౌడీ మూకల ఆగడాలు పెరిగిపోతున్నాయి. శాంతి భద్రతలు పర్యవేక్షణలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. రాత్రిళ్లు గస్తీ కాయాల్సిన పెట్రోలింగ్‌ వాహనాలు తిరగడం లేదని తెలుస్తోంది. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో నేరాలు పెరిగిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. హోంమంత్రి లేకపోవడంతో నగరంలో నేరాలకు అడ్డుకట్ట లేకుండాపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వెంటనే హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter